hyderabadupdates.com Gallery J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా

J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా

J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా post thumbnail image

J.P Nadda : బిహార్‌ ఎన్నికలు ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (J.P Nadda) అన్నారు. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నజీవి పార్టీ అంటూ కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ (RJD)… రంగ్‌దారీ (దోపిడీ), జంగల్‌రాజ్‌ (ఆటవిక పాలన), దాదాగిరీ (దౌర్జన్యం)లకు ప్రతీక అని విమర్శించారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో గురువారం ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ఆర్జేడీ చీకటి యుగం గురించి తనకు తెలుసని అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, వలసలను అడ్డుకుంటామని ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్‌ ఇచ్చిన హామీలు.. ‘భూమికి ఉద్యోగం కుంభకోణం’లో ఆర్జేడీ ప్రమేయాన్ని గుర్తుచేస్తున్నాయన్నారు. బిహార్‌లో మహిళల కోసం పనిచేస్తున్నదెవరో ఓటర్లకు తెలుసునని, వారిని తప్పుదారి పట్టించేందుకు తేజస్వి చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని సీఎం నీతీశ్‌కుమార్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు దానిని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారని విమర్శించారు.
J.P Nadda – ప్రజాస్వామ్యంలో చీకటిరోజే – సామ్రాట్‌ చౌధరీ
ఎన్నో కేసులున్న లాలూప్రసాద్‌ తనయుడిని ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అని బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీ విమర్శించారు. పోటీ అభ్యర్థుల్ని నిలిపి కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పార్టీలను లాలూ వేధిస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తేజస్వి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.17 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఆరురెట్లు ఎక్కువని చెప్పారు.
ప్రజాభిప్రాయం మారదు – ప్రశాంత్‌
సీవాన్‌: ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించినంతమాత్రాన ప్రజాభిప్రాయం ఆ కూటమికి అనుకూలంగా మారదని జన్‌సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన గురువారం సీవాన్‌లో విలేకరులతో మాట్లాడారు. తేజస్వి సీఎం అయితే లాలూ ఆటవిక పాలన మళ్లీ వస్తుందని చెప్పారు. ఈసారి గెలవబోయేది జన్‌సురాజ్‌ పార్టీయేనని, ఆర్జేడీ ఏలుబడిలో బిహార్‌ ఎంత దారుణంగా ఉండేదో ప్రజలకు గుర్తుందని అన్నారు.
నేడు బిహార్‌కు మోదీ, అమిత్‌ షా
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా బిహార్‌ లో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రక టించిన తర్వాత తొలిసారి మోదీ బిహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమిత్‌ షాకు ఇది రెండో పర్యటన. ఎన్డీయే తరఫున శుక్రవారం ఈ ఇద్దరు నేతలు మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత రత్న, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ సొంత జిల్లా సమస్తిపూర్‌ నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం.. బెగుసరాయ్‌లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి అమిత్‌ షా సివాన్, బక్సర్‌ల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన కూడా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముజఫర్‌పూర్, ఛప్రాలలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇద్దరు కీలక నేతలు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందని, ఎన్డీయే ప్రచారానికి మరింత ఊతం ఇస్తాయని ఆ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్
The post J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు

Delhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యంDelhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం

  దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్‌ విభాగంలో చేరిందని

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీPM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

    నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు.