జమ్మూకశ్మీర్ ఫరీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫరీదాబాద్‌లో ఇటీవల స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ నిల్వల శాంపిల్స్‌ను పరిశీలిస్తుండగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులో నౌగామ్ పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించిన పోలీసులు… 360 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించారు. అలాగే పలు ఆయుధాలు కూడా బయటపడడంతో అన్నింటినీ స్వాధీనం చేసుకుని, నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే శుక్రవారం అర్ధరాత్రి పేలుడు పదార్థాల నుంచి నమూనాలను సేకరిస్తుండగా… ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు దాటికి మృతదేహాల విడిభాగాలు. సుమారు 300 మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది పోలీసులు, ముగ్గురు స్థానికులు గాయపడినట్లు తెలిపారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
The post Jammu and Kashmir: ఫరీదాబాద్‌లో భారీ పేలుడు ! ఆరుగురు మృతి ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Jammu and Kashmir: ఫరీదాబాద్‌లో భారీ పేలుడు ! ఆరుగురు మృతి !
Categories: