hyderabadupdates.com Gallery Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల post thumbnail image

 
 
జమ్మూకశ్మీర్‌ లో 370వ అధికరణ రద్దు తర్వాత రాజ్యసభకు తొలిసారి శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా… ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. నాలుగో సీటును బీజేపీ దక్కించుకుని తమ ఉనికిని చాటుకుంది. మొత్తం 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. శ్రీనగర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో పోలింగ్ జరుగగా, సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
 
విజేతలు వీరే
జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) నుంచి ముగ్గురు విజేతలుగా నిలిచారు. చౌదరి మహమ్మద్ రంజాన్ మొదటి రాజ్యసభ సీటును గెలుచుకోగా, రెండో సీటును సజ్జాద్ అహ్మద్ కిచ్లూ, మూడో రాజ్యసభ సీటును జీఎస్ (షమ్మీ) ఒరెరాయ్ గెలుచుకున్నారు. ఈ మూడు సీట్లనూ ఎన్‌సీ సునాయాసంగా గెలుచుకోగా, నాలుగో సీటుకు పోటీ నెలకొంది. ఈ సీటుకు ఎన్‌సీ అభ్యర్థి ఇమ్రాన్ నబి దర్, బీజేపీ నేత సత్ శర్మ పోటీ పడగా, బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో గెలుపొందారు. జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 4 స్థానాల్లో 3 సీట్లు గెలుచుకోవడంతో ఎన్‌సీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు సైతం ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవడంతో సంబరాలు చేసుకున్నారు.
The post Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీPM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ

Narendra Modi : ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు