విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు వివిధ దేశాల్లోని పెట్టుబడిదారులను ఆకట్టుకోవడమే కాదు. మన తెలుగు భాష కూడా వారిని ఆకట్టుకుంటోంది. పరాయి దేశస్తులైనా కష్టమైన కొంతమంది తెలుగు భాష మాధుర్యాన్ని చవిచూస్తూ సంబరపడిపోతున్నారు. తమకు కష్టమైనా తమ నొట నుంచి కొన్ని తెలుగు పలుకులు పలికి పరమానంధభరితులవుతున్నారు. ఇక జపాన్ దేశ రాయభాఇఇ ఓనో కిచ్చీ అయితే ఏకంగా తెలుగు లోనే ప్రసంగం ప్రారంభించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. జపాన్ దేశతో వాణిజ్య సంబంధాలపైన ఆయన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగిస్తూ తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు.
ఈ రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా జపాన్ మరియు భారతదేశం కంపెనీల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై నేను సంతోషిస్తున్నాను. అంటూ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశారు. అంతే కాదు తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని ఆయన భావోద్వేగభరితంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా పంచుకున్నారు.
నన్ను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు
అంటూ తెలుగులో ట్వీట్ చేసి, తెలుగులో ఇదే నా మొదటి ప్రసంగమని తెలిపారు. జపాన్ ఏపీల మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సదస్సు ద్వారా మరింత బలోపేతమవుతాయని తెలిపారు. స్టీలు, ఫార్మా, రిన్యూవబుల్ ఎనర్జీ, శ్రీసిటీ ,టయోమా ప్రీఫెక్చూర్ లాంటి రంగాల్లో వాణిజ్య సహకరం కొనసాగిస్తున్నామని, ఈ సదస్సు ద్వారా జపాన్ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఈ సహకారం మరింత బలోపేతమై మరింతగా కొనసాగుతుందని తెలిపారు.
శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
శ్రీసిటీలోని 5 యూనిట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శ్రీ సిటీలో ఏర్పాటు చేయబోయే 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు. రూ.2320 కోట్ల పెట్టుబడులతో శ్రీసిటీలో ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టుల ఏర్పాటుకుకు ఎంఓయూలు జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. శ్రీసిటీలో ఎంఓయూలు మార్చుకునే కార్యక్రమాని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, శ్రీసిటీ ఎండీ రవిసానారెడ్డి, సీఎస్ కె.విజయానంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… భారత దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక టౌన్ షిప్ శ్రీసిటి. శ్రీసిటి నుంచే డైకెన్, ఇసుజూ, క్యాడ్బరీ లాంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలు ఈ శ్రీసిటీ పారిశ్రామిక టౌన్ షిప్ కు రావాలి ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు చెందిన హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ డివైసెస్ కంపెనీలకు 8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులిచ్చాం. గడచిన రెండు రోజులుగా 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి మొత్తంగా గడచిన 18 నెలల్లోనే 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. త్వరలోనే శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం. 50 దేశాలకు పైగా కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయి. త్వరలోనే 1.5 లక్షల మంది ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్ గా మారుతుంది. త్వరలో శ్రీసిటీ సమీపంలోనే ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మిస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఈ తరహా మోడల్స్ మరిన్ని రావాల్సి ఉంది. ఒక సంస్థ తయారు చేసిన ఉత్పత్తులు మరో సంస్థకు ముడిసరుకుగా మారతాయి… దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం దేశంలోనే తొలిసారిగా ఏపీ ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తోంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు భారీ ప్రణాళికలు వేస్తున్నాం. 2028 నాటికి శ్రీసిటినీ ఓ బెస్ట్ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తాం.
రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపరెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను కియాకు దగ్గర్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. అనంతపురం జిల్లా టెకులోడు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను కూడా రేమాండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల్ని ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటాం. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల పెట్టుబడులు సాధించాం. 2027 నాటికి ఈ మూడు ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చింది. రాయలసీమ లో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. కియా మోటార్స్ ఇప్పటికే ఉంది… ఏరోస్పేస్, డిఫెన్సు కారిడార్లు వస్తున్నాయి. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. రేమాండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయటం అభినందనీయం.
The post Japan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జపాన్ రాయబారి తెలుగు ప్రసంగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Japan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జపాన్ రాయబారి తెలుగు ప్రసంగం
Categories: