hyderabadupdates.com Gallery Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌ post thumbnail image

Kiran Majumdar Shaw : బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా (Kiran Majumdar Shaw) ఇటీవల ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత్‌ లో చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు వైరల్‌ అవుతుంది. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
Kiran Majumdar Shaw Post Viral
దేశవ్యాప్తంగా చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్య అంటూ ఆమె గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పెద్ద నగరాల్లోని మున్సిపాలిటీలు కూడా దీన్ని పరిష్కరించలేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఇందౌర్‌, సూరత్‌, ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల పేర్లను ఆమె ప్రస్తావించారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రజలు, పాలనాధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబయి బాంద్రాలోని ఓ ప్రాంతంలో పడి ఉన్న చెత్తను ఉద్దేశిస్తూ జర్నలిస్టు సుచేతా దలాల్‌ పెట్టిన పోస్టుకు మజుందార్ షా ఇలా స్పందించారు.
గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై మజుందార్‌ షా పెట్టిన పోస్టు వైరల్‌ అయ్యింది. బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె వెల్లడించారు. దీనిపై ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థంకావడం లేదంటూ ఆయన పేర్కొన్నారని తెలిపారు. ఈ పోస్టుపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.
Also Read : PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ
The post Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలుజలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు

హైద‌రాబాద్ : జలమండలి లోని అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ-ఆఫీస్ ను అన్ని విభాగాలలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల కార్యాలయాల్లో సామర్థ్యం,

Minister Ponnam Prabhakar Asks political parties To submit Affidavits In High Court supporting BC BillMinister Ponnam Prabhakar Asks political parties To submit Affidavits In High Court supporting BC Bill

Minister Ponnam Prabhakar demanded that all the political parties that supported the BC Reservation Bill in the Legislative Assembly submit affidavits in High Court stating that they fully support the reservations