hyderabadupdates.com Gallery KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్ post thumbnail image

 
 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలని…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రెండేళ్లలో కేసీఆర్‌ (KCR)ని తిట్టడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసినా తమకు ఓటు వేశారని.. ఆ పార్టీ నేతలు చెబుతారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకి మధ్య సయోధ్య లేక కొట్టుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు జాదు గాళ్లు అని దెప్పిపొడిచారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హామీలిచ్చి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఓటు కోసం కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత పట్టించుకోరని ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్‌ని అధికారంలోకి తెచ్చుకోవటానికి.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.
అన్ని మతాల వారిని, అన్నివర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆక్షేపించారు. మైనార్టీ సబ్ ప్లాన్ పెడతామన్నారని.. అది కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని సూచించారు. అవ్వా, తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
The post KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Wing Commander Namansh Syal: వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ కన్నీటి వీడ్కోలుWing Commander Namansh Syal: వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ కన్నీటి వీడ్కోలు

    దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రమాదంలో మృతిచెందిన పైలట్‌, వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామమైన కాంగ్రాలోని పాటియాల్కర్ ప్రాంతానికి తరలించారు. ఆయన భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్.. ఆయనకు తుది వీడ్కోలు

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదంTG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

    జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలుDK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు

  కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి కావాలని ఆశ పడటంలో తప్పు లేదన్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు