hyderabadupdates.com Gallery KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ post thumbnail image

 
 
స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఆ పార్టీ ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీలోని బీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీసీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు లేని సర్పంచి ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
 
తాము తలుచుకుంటే భూకంపం సృష్టిస్తామన్నారు. బీసీలను తక్కువ అంచనా వేయకండంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని.. మీ పీఠాలు కదిలి పోతాయని హెచ్చరించారు. బీసీ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే.. అవసరమైతే సర్పంచ్ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తామన్నారు. నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్‌గా జరుపుతున్నామని వివరించారు.
The post KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డిSudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డి

    తాను మంత్రి ప‌ద‌వి ఆశించిన మాట వాస్త‌మేన‌ని తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. కొన్ని స‌మీక‌ర‌ణాల వ‌ల్ల త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని చెప్పారు. సెక్రటేరియట్‌లో బుధ‌వారం ఉద‌యం ప్రభుత్వ సలహాదారుగా ఆయ‌న

CM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాంCM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాం

    ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌)కు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవాసులు సైతం తాము