hyderabadupdates.com Gallery Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం post thumbnail image

 
 
కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌ (స్మృతి)లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గిగ్‌ వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పించడం, ఉద్యోగులందరికీ తప్పనిసరిగా నియామక పత్రాలు అందించడం, అన్ని రంగాల్లో ఉద్యోగులకు కనీస వేతనాలు.. క్రమం తప్పకుండా అందించడం వంటి భారీ సంస్కరణలు ఉన్నాయి. వేతనాల కోడ్‌ (2019); పారిశ్రామిక సంబంధాల కోడ్‌ (2020); సామాజిక భద్రత కోడ్‌ (2020); వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిప్రదేశాల్లో పరిస్థితుల కోడ్‌ (2020)లను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
 
చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలను సరళీకరించి, ఏకీకృతం చేసినప్పటికీ మనం మాత్రం సంక్లిష్టమైన, కాలం చెల్లిన చట్టాలనే కొనసాగిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 29 చట్టాల స్థానంలో ఏకీకృత, ఆధునికీకరించిన నాలుగు కోడ్‌లను అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. కొత్త కార్మిక కోడ్‌లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ, కొన్ని రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో జాప్యం చేశాయి. దీంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నాలుగు కార్మిక స్మృతులు అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం సమగ్ర నిబంధనలు, పథకాల రూపకల్పనకు సంప్రదింపులు ప్రారంభించనుంది. కొత్త కోడ్‌లు అమల్లోకి వచ్చినప్పటికీ అవసరమైనప్పుడు ప్రస్తుత కార్మిక చట్టాల్లోని నిబంధనలు కూడా వర్తిస్తాయని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కాగా, 2015లో దేశంలో సామాజిక భద్రత కవరేజ్‌ 19 శాతం ఉండగా.. 2025 నాటికి ఇది 64 శాతానికి చేరినట్లు వెల్లడించింది. కొత్త కోడ్‌ల అమలుతో కార్మిక అనుకూల వ్యవస్థను ప్రోత్సహించినట్లయిందని పేర్కొంది.
 
ఆత్మనిర్భర భారత్‌కు పునాది
 
తాజా కోడ్‌లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్‌ కేంద్రాలు సహా అన్ని చోట్లా దేశవ్యాప్తంగా ఈఎ్‌సఐసీ సౌకర్యం కల్పించడం, సింగిల్‌ రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌, రిటర్న్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయడం, కార్మికుల సంరక్షణను బలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతో పాటు అంతర్జాతీయంగా అనుసంధానించవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. ఈ కోడ్‌లు ఆత్మనిర్భర భారత్‌కు పునాది లాంటివని అన్నారు. భారత్‌లోని కార్మిక చట్టాలు స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో అంటే 1930లు- 1950ల్లో రూపొందించినవని.. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ పని విధానాలు పూర్తి భిన్నంగా ఉండేవని మాండవీయ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.
 
 
చాలా దేశాలు ఇప్పటికే తమ కార్మిక చట్టాలను సరళతరం చేసినా.. బారత్‌లో మాత్రం పాత చట్టాలే కొనసాగుతున్నాయన్నారు. అందుకే సరికొత్త కార్మిక కోడ్‌లను అమల్లోకి తెచ్చామని తెలిపారు. ‘‘ప్రతి కార్మికుడికీ గౌరవం కల్పించాలన్నది మోదీ సర్కారు హామీ. ఈ రోజు నుంచి కొత్త కార్మిక స్మృతులు దేశంలో అమల్లోకి వచ్చాయి’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కోడ్‌లతో కార్మికులందరికీ కనీస వేతనాలు లభిస్తాయని, యువతకు నియామక పత్రాలు అందుతాయని, మహిళలకు సమాన వేతనాలు, గౌరవం లభిస్తుందని, 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ ఉద్యోగులకు ఏడాది పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ వంటివి దక్కుతాయని వివరించారు. ‘‘ఈ సంస్కరణలు సాధారణ మార్పులు కాదు. కార్మికుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ తీసుకున్న అతిపెద్ద చర్య. స్వయం సమృద్ధ భారత్‌ దిశగా కీలక ముందడుగు. 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌గా నిలవాలన్న లక్ష్యానికి ఊతం’’ అని మాండవీయ పేర్కొన్నారు.
నాలుగు స్మృతుల్లో కీలక అంశాలు ఇవే
 
ఉద్యోగులందరికీ నియామక పత్రాలు తప్పనిసరి. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి హామీ లభిస్తుంది.
గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత (పీఎఫ్‌, ఈఎ్‌సఐసీ, బీమా మొదలైనవి) కల్పించాలి.
ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉద్యోగులకు (ఎఫ్‌టీఈ) శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలి. ఎఫ్‌టీఈలు ఐదేళ్లకు బదులు కేవలం ఏడాది సర్వీసు పూర్తిచేస్తే గ్రాట్యుటీకి అర్హులు.
కార్మికులందరికీ కనీస వేతనం ఇక చట్టబద్ధమైన హక్కు. యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి. అనధికారికంగా ఎలాంటి కోతలూ విధించకూడదు.
బీడీ, సిగరెట్లు, మైనింగ్‌ పరిశ్రమల్లో రోజుకు 8-12 గంటల వరకు పనిచేయొచ్చు. వారానికి 48 గంటలు మించొద్దు. 30 రోజుల పని పూర్తి చేసుకుంటే బోన్‌సకు అర్హత ఉంటుంది.
40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి.
సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. ట్రాన్స్‌జెండర్‌ సహా లింగ వివక్ష ఉండరాదు.
సాధారణ పని గంటలకు మించి (ఓవర్‌ టైమ్‌) పని చేస్తే రెగ్యులర్‌ వేతనానికి రెట్టింపు చెల్లించాలి.
అన్ని షిఫ్టుల్లో, అన్ని రకాల పనుల్లో (భూగర్భ గనులు సహా) పనిచేయడానికి మహిళలకు అనుమతి. అవసరమైన భద్రతా చర్యలతో పాటు వారి సమ్మతి తప్పనిసరి.
మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలకు చోటు. తద్వారా ‘డిపెండెంట్‌ కవరేజ్‌’ పెరుగుతుంది.
గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్లకు తొలిసారి చట్టంలో నిర్వచనం. గిగ్‌ వర్కర్‌ అంటే సాధారణ, సంప్రదాయ యాజమాన్యాలు ఏర్పాటు చేసే ఆఫీసుల్లో పనిచేసేవారు కాదు. ప్లాట్‌ఫాం వర్కర్‌ అంటే ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సేవలందించేవారు. ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ అంటే.. సేవలందించేవారికి, వినియోగదారులకు మధ్య అనుసంధానకర్త.
అగ్రిగేటర్లు (ఉబెర్‌, ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు) తమ వార్షిక టర్నోవర్‌లో 1-2ు (కార్మికులకు చెల్లించే మొత్తంలో 5ు వరకు) సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి.
ఆధార్‌ అనుసంధానిత ‘యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌)’ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పోర్టబుల్‌గా ఉంటాయి.
జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లు, డబ్బింగ్‌ కళాకారులు, మీడియా వృత్తి నిపుణులు కూడా కార్మిక రక్షణ విధివిధానాల పరిధిలోకి వస్తారు. నియామక పత్రాలు, వేతనాల భద్రత, పనివేళల నియంత్రణ తప్పనిసరి.
కాంట్రాక్ట్‌, వలస కార్మికులకు కూడా సమాన వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలన్నీ అందించాలి. కాంట్రా క్ట్‌ సిబ్బందికి యాజమాన్యాలు సామాజిక భద్రత కల్పించాలి. తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి.
The post Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Government: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తుAP Government: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు

    జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరింది. అతి త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా మండలాలు, గ్రామాల సరిహద్దుల

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

    హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ చోరీపై ‘హైడ్రోజన్‌ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన మోడల్‌ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్‌ కాదు. పేరు లారిస్సా నెరీ. తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్‌ మాథ్యూస్‌ ఫెర్రెరో

CM Revanth Reddy: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్CM Revanth Reddy: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్

    ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మంగళవారం ఘట్కేసర్ చేరుకున్న సీఎం… అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన సతీమణిని ఓదార్చారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు.