hyderabadupdates.com Gallery Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల post thumbnail image

 
 
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడత జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు ఈరోజు (గురువారం) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు రిటర్నింగ్ అధికారులు. నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు.
నామినేషన్‌లు వేసే అభ్యర్థులు కొంత మేర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5000, రిజర్వేషన్ అభ్యర్థి రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉండగా.. ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ జరుగనుండగా… నవంబర్ 11న కౌంటింగ్ జరుగనుంది.
తొలి విడతలో సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ డివిజన్ పరిధిలోని 15 జెడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో జెడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎంపీటీసీ స్థానాలకు క్లస్టర్ స్థాయిలో నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లలోని 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ పరిధిలోని 10 జెడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది.
 
 
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ – పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
 
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గురువారం ఉదయం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.
 
బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కుల సర్వే జరిగిందని, బీసీల నోటి ముద్దను భాజపా లాగే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
The post Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bandaru Dattatreya’s `Alay Balay’ Held with Great pomp This year TooBandaru Dattatreya’s `Alay Balay’ Held with Great pomp This year Too

The “Alay Balay” festival, which is held every year to celebrate Dussehra, was held with great pomp this year too. The Alay Balay Foundation, under the auspices of former Governor Bandaru

Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని ప్రకాశం, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ!కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి