hyderabadupdates.com Gallery Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం

Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం

Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం post thumbnail image

Lokayukta Raids : మధ్యప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి అధికారులే అవాక్కయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా… నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. ఇక ఆయన ఫామ్‌హౌస్‌లో దొరికిన 17 టన్నుల తేనెను చూసి వారు ఆశ్చర్యపోయారు. భోపాల్‌లో ప్రజా పనుల విభాగంలో చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన జీపీ మెహ్రా (JP Mohra) లగ్జరీ లైఫ్‌స్టైల్‌ ఇది. ఓ అప్రకటిత ఆస్తుల వ్యవహారంలో తీగ లాగితే.. మెహ్రా బండారం బయటపడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Lokayukta Raids Sensational
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోకాయుక్త అధికారులు దర్యాప్తు చేస్తుండగా భోపాల్‌లో (Bhopal) ప్రజా పనుల విభాగంలో చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన జీపీ మెహ్రా పేరు బయటకు వచ్చింది. ఆయనపై దృష్టి సారించిన అధికారులు… మెహ్రా (JP Mohra) ఇళ్లపై దాడులు నిర్వహించారు. భోపాల్‌ (Bhupal), నర్మదాపురంలోని ఆయన ఇళ్లల్లో నలుగురు డీఎస్పీ ర్యాంక్‌ అధికారుల నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మణిపురంలోని మెహ్రా నివాసంలో 8.79లక్షల నగదు, రూ.50లక్షల విలువ చేసే ఆభరణాలు, రూ.56లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అధికారులు గుర్తించారు. దనా పానీలో మెహ్రాకు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇంట్లో విస్తృత తనిఖీలు నిర్వహించగా భారీగా నోట్ల కట్టలు, రూ.3 కోట్ల విలువ చేసే రూ.2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అధికారులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఇంజనీర్ ఇళ్లల్లో సంపద చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లో (MP) జరిగింది. లోకాయుక్త అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి బయపడ్డాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనె లభ్యమవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంజనీర్ ఫామ్‌హౌస్‌లో ఇంత భారీ స్థాయిలో తేనె ఉండటం ఏంటి? అని అధికారులు లోతైన పరిశీలన చేస్తున్నారు. భోపాల్‌లో ప్రజా పనుల విభాగంలో చీఫ్‌ ఇంజినీర్‌గా జీపీ మెహ్రా పనిచేసి రిటైర్‌ కాగా… ఇతని ఇళ్లపై అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈయన లగ్జరీ లైఫ్ చూసి అధికారులే ఒకింత ఆశ్చర్యపోయారు.
నర్మదాపురంలోని ఫామ్‌హౌస్‌ లో కళ్లుచెదిరే లగ్జరీ సముదాయాలు చూసి షాక్‌ అయ్యారు. రిటైర్డ్ ఇంజనీర్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో నిర్మాణ దశలో ఉన్న 32 అధునాతన కాటేజీలు చూసి ఖంగుతిన్నారు. మరో ఏడు కాటేజీలు పూర్తి అయినట్లు చెప్పారు. అయితే ఫామ్ హౌస్ మధ్యలో చెరువు, గోశాల, ఆలయం, నాలుగు లగ్జరీ కార్లు ఉన్నట్లు తేల్చారు. అంతే కాకుండా ఆయన ఫామ్‌హౌస్‌ నుంచి 17 టన్నుల తేనెను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని, మెహ్రా సంపద వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. మెహ్రాకు సంబంధించి బ్యాంకు రికార్డులు, డిజిటల్‌ ఫైళ్లను ఫోరెన్సిక్‌ బృందాలు తనిఖీలు నివహిస్తున్నారు. మెహ్రా బినామీ పెట్టుబడుల పైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆపరేషన్ గోవింద్‌పురా ఇండస్ట్రియల్ ఏరియాలోని కెటి ఇండస్ట్రీస్‌లో కూడా కొనసాగింది. ఇది మెహ్రా వ్యాపార సంస్థగా భావిస్తారు.ఇక్కడ, అధికారులు పరికరాలు, ముడి పదార్థాలు, రూ.1.25 లక్షల నగదు, మెహ్రా బంధువులు సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని చూపించే పత్రాలను కనుగొన్నారు. ఈ యూనిట్ మెహ్రా కుమారుడు రోహిత్ , కైలాష్ నాయక్ సంయుక్తంగా యాజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. బీమా పాలసీలు, వాటా పత్రాలు, బహుళ ఆస్తులు, అనేక కోట్ల ఆస్తులను లోకాయుక్త అధికారులు ధృవీకరించారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ ఫైళ్లు, బ్యాంకింగ్ రికార్డులను పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందాలను నియమించారు.
Also Read :  Sabarimala Gold: శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలు
The post Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదు – యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్‌ గోయల్‌Minister Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదు – యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్‌ గోయల్‌

    అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ ఎవరి ఒత్తిడికీ

జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?

ఇదే వ్యవహారం సినిమాల్లో జరిగితే గనుక.. ‘ఆడికి చిప్ దొబ్బింది రా’ అనే డైలాగు వస్తుంది. ఇది రాజకీయరంగం గనుక, పైగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గనుక అలాంటి డైలాగు అంటే.. నొచ్చుకునే వాళ్లు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, ఒక్క