ఉత్తర్‌ప్రదేశ్ లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆవిష్కరించారు. 1, 5, 10 రూపాయల నాణేలతో తయారు చేసిన ఈ విగ్రహం ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించడం విశేషం.
‘‘సంస్కృతి, ఆధ్యాత్మికతకు మనదేశం ఎంతో ప్రసిద్ధి. శ్రీరాముడు మనందరికీ ఆరాధ్యదైవం. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. భారత సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నా’’ అని పాఠక్ పేర్కొన్నారు. లఖ్‌నవూ, గోరఖ్‌పుర్, కోల్‌కతాకు చెందిన 25 మంది శిల్పులు, 20 రోజులకుపైగా శ్రమించి ఈ విగ్రహం తయారు చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు.
మహిళ ప్రాణం తీసిన గుంత
రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను గమనించకపోవడంతో బైకు ఒక్కసారిగా అందులో పడింది. దీంతో వెనుక కూర్చొన్న అనిత ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 12 కోట్లు ఖర్చు చేసి ఆ రోడ్డుకు మరమ్మతులు చేసినా.. గుంతలు ఏర్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా నాలుగు రోజుల క్రితం 55 ఏళ్ల వ్యక్తి కూడా మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
The post Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం
Categories: