hyderabadupdates.com Gallery Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ post thumbnail image

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ (BJP) ఎంపీ గణేష్ సింగ్ (MP Ganesh Singh) అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి సమీపంలోని సెమ్రియా చౌక్ వద్ద జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి హైడ్రాలిక్ క్రేన్‌ను ఉపయోగించి అందులో కూర్చొని ఎంపీ పూలమాల వేశారు.
అయితే ఈ సమయంలో క్రేన్‌లో కాస్త ఇబ్బందులు తలెత్తి ఒక్కసారిగా కుదిపేసింది. ఒక్క క్షణంలో షాక్ గురైన ఎంపీ (MP Ganesh Singh)… కోపంతో అక్కడే ఉన్న మున్సిపల్ క్రేన్ ఆపరేటర్ చెంపపై కొట్టాడు. అయితే క్రేన్‌లో సమస్య తలెత్తి కుదుపుకు గురై గాలిలో ఆగిపోయింది. దీంతో ఆయన కొన్ని సెకన్ల పాటు అందులోనే ఉండిపోయారు. కెమెరాలో రికార్డ్ అయిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ (BJP) అసలు స్వరూపం ఇదేనంటూ మండిపడుతున్నారు.
Madhya Pradesh – పీరియడ్‌ సెలవు కోసం శానిటరీ ప్యాడ్‌ ఫోటోలు పంపమన్న సూపర్‌ వైజర్లు
ఒక పక్క మహిళలు, పీరియడ్‌ సమస్యలను అర్థం చేసుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీరియడ్‌ లీవ్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తోంటే హర్యానాలోని ప్రముఖ విశ్వ విద్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైనం కలకలం రపింది. హర్యానాలోని రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో కొంతమంది మహిళా పారిశుద్ధ్య కార్మికులలు తాము పీరియడ్స్‌లో ఉన్నదీ లేనిదీ రుజువు చేసుకోవాల్సిన దుస్తితిపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది. అక్టోబర్ 26నక్యాంపస్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అక్టోబర్‌ 26న మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయాన్ని హర్యానా గవర్నర్‌ అషిమ్ కుమార్ ఘోష్ సందర్శించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ మహిళలతో సహా పారిశుద్ధ్య కార్మికులందరిని విధులకు పిలిచారు. విధుల్లో ఉన్న పారిశుద్ధ్య మహిళలు ఆలస్యంగా వచ్చారు. మరికొంతమంది సెలవు అడిగారు. రుతుక్రమం, అనారోగ్యంతోఉన్నామని, సిబ్బంది చెప్పినప్పుడు… ఇద్దరు వినోద్, జితేంద్ర సూపర్‌వైజర్లు అబద్ధం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలకు సెలవు ఇవ్వలేదు సరికదా… ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్‌ ఫొటోలు పంపాలని వీరు బలవంతం చేశారు. ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ డ్యూటీకి వచ్చిన ఒక మహిళను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, రుతుక్రమాన్ని మరో మహిళా సిబ్బందితో తనిఖీ చేయించారు. అలాగే ఇలా చేయడానికి నిరాకరించిన మహిళల్ని ఉద్యోగంలోంచి తీసేస్తామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన తెలిపారు.వీరికి తోటి మహిళా సిబ్బంది, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. నిరసనకు దిగాయి. దిగ్భ్రాంతి కరమైన సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌తో సంఘటన ఫోటోలు . వీడియోలను కూడా బాధితలు పంచుకున్నారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణన్ కాంత్ దీనిపై ఇంటర్నల్‌ దర్యాప్తునకు ఆదేశించింది. మరియు దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సూపర్‌వైజర్లతోపాటు, మరొకరిపై కేసు నమోదైంది. కాగా హర్యానాలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పీరియడ్‌లీవ్‌ విధానమేమీ లేదు. కానీ ఇటీవలి ఆదేశాల ప్రకారం అన్ని మహిళా కాంట్రాక్టు ఉద్యోగులు (హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ ద్వారా నియమించబడిన వారితో సహా) నెలకు రెండు రోజుల క్యాజువల్ సెలవులు తీసుకోవచ్చు.
Also Read : Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్
The post Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూతAnde Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత

    ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ

YS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లుYS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లు

    వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ జగన్‌ పర్యటన వివరాలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన వివరాల

TTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసుTTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు

    పరకామణిలో డాలర్ల చోరీ కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్‌