hyderabadupdates.com Gallery Manoj Gaur: హౌసింగ్‌ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ అరెస్టు

Manoj Gaur: హౌసింగ్‌ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ అరెస్టు

Manoj Gaur: హౌసింగ్‌ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ అరెస్టు post thumbnail image

 
 
హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో వేల కోట్ల మనీలాండరింగ్‌ కుంభకోణానికి సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కాంట్రాక్టు పనులను ఇదే మనోజ్‌గౌర్‌కు చెందిన జేపీ గ్రూపు కంపెనీ చేపట్టింది. ఇటీవల ఆ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. గౌర్‌ నేతృత్వంలోని జేపీ ఇన్‌ఫ్రా సంస్థ ఢిల్లీ, హర్యానాలో జేపీ విష్‌టౌన్‌, జేపీ గ్రీన్స్‌ పేరిట పలు హౌసింగ్‌ ప్రాజెక్టులు ప్రారంభించి వేలాది మంది కొనుగోలుదారుల నుంచి వందల కోట్లను వసూలు చేసింది. ఆ నిధులను గృహ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉపయోగించకుండా, వాటిని వివిధ ట్రస్టులు, అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
హౌసింగ్‌ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం, ఫ్లాట్లను అప్పగించకపోవడంతో మోసపోయిన వేలాది మంది పెట్టుబడిదారులు ఢిల్లీ, యూపీలలోని ఆర్థిక నేరాల విభాగం వద్ద అనేక కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ జేపీ గ్రూపునకు చెందిన రెండు సంస్థలు జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ (జేఏఎల్‌), జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ (జేఐఎల్‌) గృహ కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రూ. 14,599 కోట్ల భారీ మొత్తాన్ని జేపీ సేవా సంస్థాన్‌ (జేఎ్‌సఎస్‌), జేపీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (జేహెచ్‌ఎల్‌), జేపీ స్పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (జేఎ్‌సఐఎల్‌) వంటి అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించింది. మే 23న ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ భారీ మొత్తంలో ఆర్థిక పత్రాలు, డిజిటల్‌ రికార్డులను స్వాధీనం చేసుకుంది. నిధుల మళ్లింపులో గౌర్‌ కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించింది.
The post Manoj Gaur: హౌసింగ్‌ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ అరెస్టు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Gujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామాGujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామా

Gujarat Cabinet : గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మరికాసేపట్లో

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీCM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

    ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని