పెళ్లి అంటే నూరేళ్ళ పంట. అందుకే దీనిని ఎన్నో కలలు, మరెన్నో కోరికలతో ఒక పండుగా చేసుకుంటారు. జీవితంలో ఒకే సారి జరిగే ఈ తంతు కోసం కోట్లు ఖర్చు చేసిన సందర్భాలు ఎన్నో. ఈ నేపథ్యంలో కేరళలోని అలప్పుళకు చెందిన అవనికి కూడా అలాంటి ఉత్సాహంతోనే తన పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తంబోలికి చెందిన శరణ్ తో శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉండగా… అలంకరణ కోసం కుమారకోమ్ బయలుదేరింది. అయితే మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై కొచ్చిలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా వెన్నెముకకు గాయమైనట్లు తేలింది.
అయితే అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు ముహుర్తానికే పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి వాయిదా వేయడం ఎందుకని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు… ముహూర్త సమయంలోనే ఆస్పత్రి బెడ్‌పైనే పెళ్లి నిర్వహించాలనుకున్నారు. ఈ విషయాన్ని వైద్యులకు తెలియజేయగా వారూ అంగీకరించారు. దీంతో ఎమర్జెన్సీ వార్డు పెళ్లి వేదిక కాగా.. వైద్యులు, కుటుంబ సభ్యుల మధ్య వధువు మెడలో వరుడు తాళికట్టాడు. దీనితో ఇప్పుడు వీరి పెళ్లి ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అవనికి త్వరలోనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
The post Marriage in ICU: ఐసీయూలో వివాహం చేసుకున్న కొత్త జంట ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Marriage in ICU: ఐసీయూలో వివాహం చేసుకున్న కొత్త జంట !
Categories: