hyderabadupdates.com Gallery Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్

Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్

Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్ post thumbnail image

Martlet Missiles : భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరనుంది. రక్షణరంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్‌-యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్‌’ (Martlet Missiles)లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని కేంద్రం తమ ప్రకటనలో వెల్లడించింది.
Martlet Missiles – ఇంతకీ ఏంటీ ‘మార్ట్‌లెట్‌’ క్షిపణులు ?
ఈ మార్ట్‌లెట్‌ క్షిపణులను ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు చెందిన ‘థేల్స్‌ ఎయిర్‌ డిఫెన్స్‌’ అనే రక్షణరంగ సంస్థ అభివృద్ధి చేస్తోంది. పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే ‘మార్ట్‌లెట్‌’ (Martlet Missiles) అనే పక్షి పేరు మీదుగా ఈ క్షిపణులకు పేరు పెట్టారు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోని, అలుపెరగని పక్షి అని దీని అర్థం. ఇవి తేలికపాటి, బహుళ ప్రయోజనకర ఎయిర్‌-టు-ఎయిర్‌, ఎయిర్‌-టు-సర్ఫేస్‌, సర్ఫేస్‌-టు-సర్ఫేస్‌, సర్ఫేస్‌-టు-ఎయిర్‌ క్షిపణి వ్యవస్థలు. గగనతల రక్షణతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి మిలిటరీ టార్గెట్‌లను కూడా ఛేదించేలా వీటిని రూపొందించారు. లేజర్‌ బీమ్‌ గైడెన్స్‌ ఆధారంగా రూపొందించిన ఈ క్షిపణిని పదాతిదళ సైనికులు భుజంపై ఉంచుకొని ప్రయోగించే వీలు ఉంటుంది. సాయుధ వాహనాలకు అనుసంధానం చేసి హెలీకాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించొచ్చు. ఆరు కిలోమీటర్ల పరిధిలో భూ, గగనతల ముప్పును ఈ క్షిపణులు ఎదుర్కోగలవు. 13 కిలోల బరువు ఉండే ఈ మిసైల్స్‌ ధ్వని వేగం కంటే ఒకటిన్నర రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. వీటిని 2019 నుంచి బ్రిటిష్‌ మిలిటరీలో వినియోగిస్తున్నారు. ఇవే క్షిపణులను ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌ వినియోగిస్తోంది.
భారత నేవీ కోసం రోల్స్‌ రాయిస్‌
మరోవైపు, భారత నౌకాదళంతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్‌ ఆసక్తి కనబర్చింది. నౌకాదళం అభివృద్ధి చేస్తున్న దేశీయ తొలి ఎలక్ట్రిక్‌ యుద్ధ నౌక డిజైనింగ్‌లో ఈ కంపెనీ భాగస్వామి కానున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ నౌకకు హైబ్రీడ్‌ ఎలక్ట్రిక్‌, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలను అందించనున్నట్లు సమాచారం.
Also Read : India Afghanistan: కాబుల్‌ లో భారత రాయబార కార్యాలయం
The post Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!

వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మరియు ‘బ్యూటీ’ వంటి సినిమాలు విజయవంతంగా రీల్‌లో వచ్చాయి. విభిన్న కథలతో సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా Vijay Pal Reddy అడుగుపెట్టారు. ఇప్పుడెన్నో విజయాల తర్వాత, ఆయన మరోసారి