hyderabadupdates.com Gallery Menstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

Menstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

Menstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు post thumbnail image

Menstrual Leave : మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ, బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది.
Menstrual Leave in Karnataka
‘‘శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. నెలసరి ఆరోగ్యంపై (Menstrual Leave) అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే మా ఉద్దేశం. ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరించనుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే ఇక్కడా ఆ సెలవును ఇవ్వాలనుకున్నాం’’ అని క్యాబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని హర్షం వ్యక్తంచేశారు. అయితే అసంఘటిత రంగంలో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే బిహార్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అలాగే జొమాటో, స్విగ్గీ, ఎల్‌ అండ్‌ టీ, గోజూప్ వంటి సంస్థలు వేతనంతో కూడిన ఈ సెలవును ఇస్తున్నాయి.
క్యాబినెట్ మంత్రులకు సీఎం సిద్ధూ స్పెషల్ డిన్నర్‌
కర్ణాటక (Karnataka) క్యాబినెట్‌లో బిగ్ ఛేంజ్ రానుందా..? మంత్రులకు డిన్నర్ ఇచ్చి తర్వాత వేటేయనున్నారా..? రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో 50 శాతం మంత్రులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 13న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్యాబినెట్ మంత్రులకు డిన్నర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (Congress) హైకమాండ్‌తో చర్చించిన సమయంలో సీఎం తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించినట్లు సమాచారం. నవంబర్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దానిలోభాగంగా ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న 50 శాతం మంది మంత్రులను తొలగించి, కొత్తవారికి అవకాశం ఇస్తారని సమాచారం.
కొత్తవారిని క్యాబినెట్‌లోకి తీసుకుంటే.. ఆ వెంటనే సీఎం మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం కష్టతరమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలో ముఖ్యమంత్రి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వీలు కలగనుందని చెప్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పుపై రోజుకో చర్చ నడుస్తోంది. తనకు సీఎం పదవి చేపట్టాలని ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఎం వద్దకు బిగ్‌బాస్‌ పంచాయితీ !
కన్నడ బిగ్‌బాస్ హౌస్‌కు (Kannada Bigg Boss) తాళాలు వేసిన వ్యవహారంపై కర్ణాటకలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తాయి. వారి పంచాయతీ ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య వద్దకు చేరింది. బిగ్‌బాస్‌ హౌస్‌ను మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం జరుగుతున్న బిడదిలోని అమ్యూజ్‌మెంట్ పార్కు ‘జాలీవుడ్‌’ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తోందని ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. వీటిని షో నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో హౌస్‌కు తహసీల్దారు తేజస్విని అధికారులతో కలిసి బయట నుంచి తాళాలు వేశారు.
ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్, ఎమ్మెల్యే నరేంద్రస్వామి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఆ బోర్డ్ పని చేస్తోంది. అయితే ఆ శాఖ బాధ్యతలు చూస్తోన్న మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు ఎమ్మెల్యే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నరేంద్ర స్వతంత్రంగా వ్యవహరించడం మంత్రిని షాక్‌కు గురిచేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసిందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం సీఎం సిద్ధరామయ్య చెంతకు చేరింది. ఆయన ఆ ఇద్దరు నేతలతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తజోక్యంతో బిగ్‌బాస్ హౌస్‌ తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read : YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్
The post Menstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

అవును మరి.. వివాదం పుట్టించినా సరే.. నిజాలను మాత్రమే ప్రచారం చేస్తే దానికి పెద్ద ప్రజాదరణ ఉండదు. సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే జీవితంగా అందరూ బతుకుతున్న రోజులివి. మరి మామూలు వివాదానికి కూడా సెలబ్రిటీని జోడిస్తే.. దానికి క్రేజ్ పెరుగుతుంది