hyderabadupdates.com Gallery Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి post thumbnail image

 
 
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ… బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
సుప్రీంకోర్టులో… రిజర్వేషన్లకు 50శాతం క్యాప్‌ పెట్టిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయంలోనే. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 50శాతం క్యాప్‌నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం భాజపా పూర్తి మద్దతు ఉంటుంది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి కోసం 3 పేర్లను జాతీయ పార్టీకి పంపించాం. పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉటుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
 
తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌.కృష్ణయ్య
 
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఏర్పాటు చేశారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌.కృష్ణయ్య, వైస్‌ ఛైర్మన్‌గా వీజీ నారగోని వ్యవహరించనున్నారు. బీసీ జేఏసీలో ముఖ్యమైన ఆరుగురితో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే.. కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు. ‘‘ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక స్టే ఇవ్వకూడదు. బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చాం. అన్యాయాన్ని 76 ఏళ్లుగా బీసీలు భరిస్తూ వస్తున్నారు. బీసీలకు అన్యాయంతోపాటు ఇప్పుడు అవమానం జరిగింది. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం’’ అని కృష్ణయ్య పిలుపునిచ్చారు.
The post Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్

Rivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణిRivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణి

Rivaba Jadeja : గుజరాత్‌ లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్‌ ఏర్పాటు అయింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌ లో నేడు 26 మంది సభ్యుల కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారిలో

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

    గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా