hyderabadupdates.com Gallery Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌ post thumbnail image

 
 
భారత్-ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీది కీలక పాత్ర అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్‌.. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య స్వేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. గత 16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వివరించారు.
ఏపీలో పారిశ్రామికవేత్తల కోసం సులభతర పాలసీలు అమలుచేస్తున్నట్లు చెప్పారు ఆర్సెలార్ మిత్తల్‌ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోందని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా మారిందన్నారు. నవంబర్‌లో 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025కి హాజరుకావాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.
ఏపీలోని వర్సిటీలతో కలిసి పనిచేయండి – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌
 
మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో ఆయన భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం చొరవ చూపాలన్నారు. ఆంధ్రప్రదేశ్-గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన సమన్వయానికి ఏపీలో హబ్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధ్రువీకరణకు ఏపీ వర్సిటీలతో భాగస్వామ్యం వహించాలని కోరారు.
‘‘పునరుత్పాదక శక్తి, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించాలి. గ్రిఫిత్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలి. స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలి. స్టార్టప్‌లకు మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయాలి’’ అని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. (Andhra Pradesh News)
 
సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్ఠ భద్రత – మంత్రి లోకేశ్‌
తుని రూరల్‌ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్‌కు గురయినట్లు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్ఠమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు.
The post Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనితVangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత

    అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమలSabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

    కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే(సోమవారం) దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన