hyderabadupdates.com Gallery Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష post thumbnail image

 
 
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపకశాఖ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టం అంచనాలను రూపొందించాలన్నారు.
వంతెనలు, కల్వర్టులను పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు పాముకాటుకు ఉపయోగించే ఔషధాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని తెలిపారు. హోంమంత్రి అనిత, సీఎస్ కె.విజయానంద్, ఆర్టీజీఎస్‌ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
 
కూలిన బ్రహ్మంగారి నివాస గృహం పునరుద్ధరించాలి – మంత్రి నారా లోకేశ్
 
మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలకు బ్రహ్మంగారిమఠంలో 16 శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ‘X’ వేదికగా స్పందించారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని పునరుద్ధరించాలని, మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది. దీంతో అధికారులపై, బ్రహ్మంగారి కుటుంబ సభ్యులపైన భక్తులు మండిపడుతున్నారు. అతి పురాతనమైన, చారిత్రాత్మక ఆనవాలు గల నివాసంపై శ్రద్ధ చూపలేదని మండిపడుతున్నారు. శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు ఇల్లును కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇప్పటికే సచివాలయంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు వచ్చే 48 గంటల పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ ను పునరుద్ధరించాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టం అంచనాలను రూపొందించాలన్నారు.
 
గురువారం పాఠశాలలకు సెలవు
 
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొంథా తుఫాను ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. కుండపోతగా వర్షం కురవడంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలో రేపు(గురువారం) పాఠశాలల (Schools)కు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలకు (పదోతరగతి వరకు), అంగన్వాడీలకు రేపు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు.
 
విశాఖలో బస్సులు రద్దు
అలాగే, మొంథా తుఫాను ప్రభావం ఏపీఎస్ ఆర్టీసీపై పడిందని విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం రీజియన్‌లో 30 శాతం బస్సులు రద్దు చేశామని వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకి సెలవులు కాబట్టి.. కొన్ని బస్సులు రద్దు చేశామని చెప్పుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదకు వరద వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బస్సులని జాగ్రత్తగా ఆర్టీసీ డ్రైవర్లు నడపాలని సూచించారు. రేపటి నుంచి విశాఖపట్నం రీజియన్‌లో పూర్తి స్థాయిలో బస్సులు నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అప్పలనాయుడు వెల్లడించారు.
అనకాపల్లి జిల్లాలో
 
అనకాపల్లి జిల్లాలో రేపు(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. విద్యాసంస్థల్లో మొంథా తుఫాను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు వసతి కల్పించిన కారణంగా జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు.
అల్లూరిజిల్లా పాడేరులో
 
అల్లూరిజిల్లా పాడేరులో రేపు(గురువారం) ప్రైమరీ స్కూళ్లకు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సెలవు ప్రకటించారు. అయితే, అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్ యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. జిల్లాలోని పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందజేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, రెడ్ గ్రామ్ పప్పు కేజీ, వంటనూనె లీటరు, ఉల్లిపాయలు కేజీ, బంగాళదుంపలు కేజీ, పంచదార కేజీలని ఏపీ ప్రభుత్వం ఇస్తుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించారు.
 
The post Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీPM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

    బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్‌ మాజీ సీఎం, దివంగత

Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షంDonald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

Donald Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్‌… దక్షిణకొరియా వేదికగా ట్రంప్ (Donald Trump)… మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామంYS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

  రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు