hyderabadupdates.com Gallery Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన post thumbnail image

 
 
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. ఇక నేటితో లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. దీనిపై మంత్రి సామాజిక మాద్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఆస్ట్రేలియా పర్యటనపై పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులను కలిశానని… ఎన్నో విషయాలను నేర్చుకున్నానని లోకేష్ వెల్లడించారు.
 
‘ఆస్ట్రేలియాలో నాలుగు నగరాల్లో జరిగిన నా 7 రోజులు పర్యటన ఇంతటితో ముగిసింది. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, భారత్ – ఆస్ట్రేలియా మండళ్లు, సముద్ర ఆహార సంస్థలు, క్రీడా కేంద్రాలు — ప్రతి చోటా చాలా విషయాలు నేర్చుకున్నాను. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న ఈ సమయంలో, మన శ్రామిక శక్తి మరింత బలోపేతం చేయడానికి ఉన్న అవకాశలు పరిశీలించాను. పరిశోధన, అభివృద్ధి (R&D) నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. క్రీడలను కూడా ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లే పెద్ద అవకాశంగా నేను చూస్తున్నాను. ఈ పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నాను. ఇవి త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడే భాగస్వామ్యాలుగా మారతాయని నమ్ముతున్నాను’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
The post Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

    గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా

‘Kantara Chapter 1’ Success Trailer Released by Hombale Films‘Kantara Chapter 1’ Success Trailer Released by Hombale Films

The prequel to the blockbuster Kantara, titled Kantara Chapter 1, has been receiving widespread acclaim since its release. Celebrating the overwhelming audience response, Hombale Films released the official Success Trailer

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

    నేను ఉప ముఖ్యమంత్రిగానో… ఎమ్మెల్యేగానో… ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా… వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి… ఇక్కడికి వచ్చానని