రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. ఇక నేటితో లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. దీనిపై మంత్రి సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆస్ట్రేలియా పర్యటనపై పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులను కలిశానని… ఎన్నో విషయాలను నేర్చుకున్నానని లోకేష్ వెల్లడించారు.
‘ఆస్ట్రేలియాలో నాలుగు నగరాల్లో జరిగిన నా 7 రోజులు పర్యటన ఇంతటితో ముగిసింది. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, భారత్ – ఆస్ట్రేలియా మండళ్లు, సముద్ర ఆహార సంస్థలు, క్రీడా కేంద్రాలు — ప్రతి చోటా చాలా విషయాలు నేర్చుకున్నాను. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న ఈ సమయంలో, మన శ్రామిక శక్తి మరింత బలోపేతం చేయడానికి ఉన్న అవకాశలు పరిశీలించాను. పరిశోధన, అభివృద్ధి (R&D) నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. క్రీడలను కూడా ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లే పెద్ద అవకాశంగా నేను చూస్తున్నాను. ఈ పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నాను. ఇవి త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడే భాగస్వామ్యాలుగా మారతాయని నమ్ముతున్నాను’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
The post Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన
Categories: