hyderabadupdates.com Gallery Minister Sridhar Babu: ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ – మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ – మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ – మంత్రి శ్రీధర్ బాబు post thumbnail image

Minister Sridhar Babu : తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో-ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
Minister Sridhar Babu – ఆదిభట్లలో న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL), సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ ద్వారా ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్)లు తయారు కానున్నాయి.
ఈ కొత్త యూనిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని ‘ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్’ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయని మంత్రి చెప్పారు. విమాన తయారీ కంపెనీలకు రాష్ట్రం గమ్యస్థానంగా ఉందని, ఇక్కడ తామ కార్యకలాపాలు చేపట్టాలని అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.
Minister Sridhar Babu – మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు భారీ ఊరట హైకోర్టు తీర్పును కొట్టివేసిన ‘సుప్రీం’
తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. సుప్రీంలో 1200 మంది మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు (mphs) ఊరట దక్కింది. మల్లీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల కొనసాగింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2013లో ఉమ్మడి ఏపీలో కారుణ్య నియామకాల కింద 1200మంది ఎంపీహెచ్‌ఎస్‌లు ఉద్యోగం పొందారు. అయితే, ఆ నియామక ప్రక్రియను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఆ 1200మందిని కారుణ్య నియామకం కింద నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు 1200మంది మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల నియామకాల్ని రద్దు చేసింది. దీనిపై ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయ స్థానం .. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు వారి ఉద్యోగాల్లో కొనసాగించవచ్చని కీలక తీర్పును వెలువరించింది.
Also Read : DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌
The post Minister Sridhar Babu: ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ – మంత్రి శ్రీధర్ బాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !

  మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. షియోపూర్‌ జిల్లా హల్పూర్‌ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన

Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షాAmit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా

Amit Shah : తనయుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, కుమారుడు తేజస్విని బిహార్‌ కు ముఖ్యమంత్రిగా చూడాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పరితపిస్తున్నా ఆ రెండు పదవులూ ఖాళీగా లేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా