hyderabadupdates.com Gallery MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు post thumbnail image

 
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల తో ఫోన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడారు. ఆందోళన పడకండి… బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో హరీశ్‌రావు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కార్మికుల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు హరీశ్‌రావు.
 
మరోవైపు.. బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎలాగైనా కార్మికులని తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో 12 మంది తెలంగాణ వలస కార్మికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు హరీశ్‌రావు.
చేతిలో డబ్బులు లేవు – కార్మికుల ఆవేదన
ఈ సందర్భంగా హరీశ్‌రావుతో కార్మికులు ఫోన్‌లో మాట్లాడారు. దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులం బతుకుతున్నామని వివరించారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హరీశ్‌రావుకి గోడు వెళ్లబోసుకున్నారు కార్మికులు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో జరుగుతున్న సిద్దిపేట జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. ‘దేశం కోసం మీరు చేసే సేవ గొప్పది. మిలిటరీలో ఉండే క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. ఇతర ప్రాంతాల్లో మీరు ఉద్యోగం చేస్తే.. మీ పిల్లలు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సైనికులు దేశం కోసం పని చేస్తారు.. అందుకే మీరంటే అందరికీ ఆదర్శం. తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్‌ సమస్యలకి పరిష్కారం చూపిస్తాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
 
సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌ లో 59 మంది నిందితుల అరెస్ట్
సినిమాల పైరసీ గ్యాంగ్‌ పై తెలంగాణ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ఆపరేషన్ల ద్వారా 8 రాష్ట్రాల్లోని 59 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్‌- 2025లో నమోదైన సైబర్ కేసులు, అరెస్ట్ వివరాలు వెల్లడించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సెప్టెంబర్‌లో మొత్తం రూ.86,64,827లను బాధితులకు రిఫండ్ చేశారు సైబర్ పోలీసులు. సెప్టెంబర్‌లో 320 NCRP ఫిర్యాదులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా 257 కేసులు
 
320 కేసుల్లో 222 కేసులు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్లలో… మరో 106 కేసులు జోనల్ సైబర్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్- 28, డిజిటల్ అరెస్ట్ -6, పార్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్- 4 , మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కేసులు- 2, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్-4, మూవీ పైరసీ-3, జాబ్ ఫ్రాడ్-1, ట్రేడింగ్ ఫ్రాడ్1, సోషల్ మీడియా ఫ్రాడ్స్-4, ఇతర కేసులు-2 నమోదయ్యాయి. 59మంది నిందితులపై దేశవ్యాప్తంగా 257 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మూవీ పైరసీ గ్యాంగుపై 74 కేసులు నమోదైనట్లు వెల్లడించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
 
నిందితుల దగ్గరి నుంచి మొబైల్ ఫోన్లు-43, చెక్ బుక్స్-9, పాస్‌బుక్స్, 23 డెబిట్ కార్డులు , ల్యాప్ ట్యాప్‌లు- 4, సిమ్ కార్డులు-21, షెల్ కంపెనీ స్టాంప్-1 స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మూవీలను పైరసీ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు సైబర్ పోలీసులు. సింగిల్, హిట్ ది థర్డ్ కేసు, కుబేర సినిమాల పైరసీ కేసుల్లో ఐదుగురు నిందితులని అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణ, తమిళనాడు, బిహార్, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 1Tamil Blasters, 5Moviez Rulz వంటి వెబ్‌సైట్ల ద్వారా పలు చిత్రాలను లీక్ చేస్తోంది ఈ మూవీ పైరసీ ముఠా. నిందితుల దగ్గర ఉన్న సీపీయూలు, ల్యాప్‌ట్యాప్స్, మొబైల్స్, హార్డ్‌ డిస్క్‌లని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు.
The post MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Saudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందంSaudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

    సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ