పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్ సమాధానం చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. నిజాయితీ గల స్నేహితునిగా భారత్‌కు సహకరించటం ద్వారానే దాయాదికి మేలు జరుగుతుందన్నారు. సంఘ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా భారత్ ప్రతిసారి ఓడించాలని, అప్పుడు పాకిస్థాన్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అభిప్రాయపడ్డారు.
‘ఎల్లప్పుడూ మనం శాంతినే కోరుకుంటాం. పాకిస్థానే మనతో శాంతి కోరుకోవట్లేదు. భారత్‌కు హాని చేయటం ద్వారా ఎంతోకొంత సంతృప్తి చెందినంతకాలం పాకిస్థాన్ అలాగే చేస్తుంది. శాంతిని పాకిస్థాన్ ఉల్లంఘిస్తే అది ఎప్పుడూ విజయం సాధించలేదు. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత ఎక్కువ నష్టపోతుంది. 1971లో పాకిస్థాన్ దండయాత్ర చేసింది. 90వేల మంది సైనికులను కోల్పోయింది. ఆ విధంగా వరుసగా జరిగితే పాకిస్థాన్ పాఠం నేర్చుకుంటుంది. భారత్‌ను ఏమీ చేయలేమనే విషయం ఆ దేశానికి అర్థం కావాలి. పాక్ కుట్రలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. తగిన విధంగా సమాధానం చెప్పాలి. ప్రతిసారీ ఓడించాలి’ అని భాగవత్ అన్నారు.
మేం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు
ఆరెస్సెస్‌ను ఇప్పటివరకు అధికారికంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలపై భాగవత్ స్పందించారు. ‘‘హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు. అదే విధంగా మేం కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరెస్సెస్‌ను గుర్తింపులేని సంస్థగా పేర్కొంటున్నాయి. గుర్తింపే లేని సంస్థను గతంలో మూడుసార్లు ఎలా నిషేధించారు? మా సంస్థ గుర్తింపు పొందిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏముంటాయి? 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించినట్లుగా నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో అధికారికంగా నమోదు చేయించాలా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఆరెస్సెస్‌ను నమోదు చేసుకోవడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేయలేదు. ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆరెస్సెస్‌ను వ్యక్తుల సంఘంగా గుర్తించాయి. దానిలో భాగంగానే పన్నుల నుంచి మినహాయించాయి’’ అని వివరించారు.
సంఘ్ శాఖకుఎవరైనా రావచ్చు!
ఎవరైనా తమ శాఖలకు రావచ్చని, ముస్లింలు, క్రైస్తవులన్న బేధభావం లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టంచేశారు. అయితే తాము ఫలానా అన్న ప్రత్యేకతను దూరం పెట్టి, భరతమాత పుత్రులుగా రావాలన్నారు. సమాజంలో అందరినీ కలిసికట్టుగా ఉంచాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తినో, రాజకీయ పార్టీనో ఆర్‌ఎ్‌సఎస్ సమర్థించదని.. విధానాలకే మద్దతిస్తుందని స్పష్టంచేశారు. ‘ఏ పార్టీకీ మద్దతివ్వం. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనం’ అని పేర్కొన్నారు.
‘రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతిచ్చి ఉంటే సంఘ్ కార్యకర్తలే దానికే ఓటేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎ్‌సఎస్ రిజిస్టర్డ్ సంఘం కాదన్న ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలను భాగవత్ ప్రస్తావిస్తూ.. ‘ఆర్‌ఎ్‌సఎస్ 1925లో ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం వద్ద మేం రిజిస్టర్ చేసుకోవాలా? స్వాతంత్ర్యానంతరం రిజిస్ట్రేషన్ తప్పనిసరని చట్టాలు చెప్పలేదు. అయితే, ఐటీ విభాగం, కోర్టులు సంఘ్‌ను వ్యక్తుల సంఘంగా గుర్తించాయి. మాకు ఐటీ నుంచి మినహాయింపు కూడా ఇచ్చాయి. సంఘ్‌పై 3సార్లు నిషేధం విధించారు. తద్వారా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినట్లయింది’’ అన్నారు. ‘‘రిజిస్టర్ కాని అంశాలు చాలానే ఉన్నాయి. హిందూ ధర్మం కూడా రిజిస్టరై లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
The post Mohan Bhagwat: పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి – మోహన్ భాగవత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Mohan Bhagwat: పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి – మోహన్ భాగవత్
Categories: