hyderabadupdates.com Gallery MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ post thumbnail image

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసింది. అయితే రూ.50,000 విలువచేసే రెండు జామీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు రద్దు చేయాలని ఆదేశించింది. న్యూయార్క్ పర్యటన వివరాలు కోర్టుకు సమర్పించాలని సూచించింది. పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్ పోర్టు సిట్ అధికారులకు అప్పగించాలని తెలిపింది. దీనితో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) లైన్ క్లియర్ అయినట్లయింది.
MP Mithun Reddy Foreign Tour
న్యూయార్క్‌లో ఎక్కడ బస చేస్తున్నారనే వివరాలను అందజేయాలని ఆజ్ఞాపించింది న్యాయస్థానం. మిథున్ రెడ్డి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి న్యూయార్క్‌ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్ పోర్టుని సిట్ అధికారులకు అప్పగించాలని షరతులు విధించింది. న్యూయార్క్ వెళ్లడానికి బుక్ చేసిన విమానం టికెట్ల ఫొటో కాపీలను కోర్టులో సమర్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్‌రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు పైవిధంగా తీర్పును వెలువరించింది.
Also Read : Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
The post MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ramachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులుRamachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు

Ramachandra Yadav : నక్కపల్లి బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను (Ramachandra Yadav) పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్యYatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో