hyderabadupdates.com Gallery Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్

Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్

Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్ post thumbnail image

 
 
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్‌ బాలాజీనే కారణమని ఆరోపించారు. పథకం ప్రకారం ఆయన ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగేలా చేశారని… అందువల్లే 41మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
2026 ఏప్రిల్ 20 తర్వాత తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని… జనవరి 10 తర్వాత ఈ కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని నాగేంద్రన్ పేర్కొన్నారు. డీఎంకే (DMK) కూటమిలోని రెండు వర్గాలకు మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ వాటితో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నారు. డీఎంకే అధికారం చేపట్టి నాలుగేళ్లైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చేయని ముఖ్యమంత్రి స్టాలిన్ తన కొడుకును మాత్రం ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటికి ఆయన జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు.
కాగా కరూర్‌ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు విజయ్‌తో కూటమి చర్చలకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తుండగా… మరోవైపు టీవీకేతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌లోని ఓ వర్గం పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిసామి ఈనెల 6న విజయ్‌కు ఫోన్‌ చేసి… ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో కూటమి ఏర్పాటు చర్చలకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శత్రువైన డీఎంకేను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓడించడానికి ఒకే కూటమి గొడుగు కిందకు రావడం అవసరమని సూచించగా పొంగల్‌ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని విజయ్‌ సమాధానం ఇచ్చారని సమాచారం. మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
The post Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీPM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

    నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు.

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్కVruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

    వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్‌ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం

KTR: జూబ్లీహిల్స్‌ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే – కేటీఆర్KTR: జూబ్లీహిల్స్‌ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే – కేటీఆర్

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఒక కనువిప్పు అవుతుందని చెప్పారు. తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తుందని