hyderabadupdates.com Gallery NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు post thumbnail image

 
 
బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) 29 స్థానాల్లో బరిలో దిగనుంది. కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం)కు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఆరు చొప్పున సీట్లు కేటాయించారు.
బీహార్‌ సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు. సీఎం నితీష్‌ కుమార్‌ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.
సీట్ల పంపకాలు జరిగింది ఇలా
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు
హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు
 
 
 
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో నీతీశ్‌ పార్టీ 115 స్థానాల్లో బరిలో దిగగా… కాషాయదళం 110 సీట్లకు పోటీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే 22 సీట్లలో పోటీ చేసిన ఎల్‌జేపీ (రాంవిలాస్‌).. ఈసారి అదనంగా మరో ఏడు స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు.. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (మహాగఠ్‌బంధన్‌)లో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీ 135-140 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ 70 సీట్లు అడుగుతుండగా 50-52 వరకు ఇస్తామంటోంది. కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
The post NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IRCTC Scam: బీహార్‌ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌IRCTC Scam: బీహార్‌ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌

IRCTC Scam : బీహార్‌ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణీ రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై అభియోగాలు

Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్