జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును చేపట్టాయి. కిష్తివాడ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
కిష్తివాడ్‌లోని ఛత్రు ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు కొన్ని నెలలుగా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ ! ముగ్గురు మావోలు మృతి !
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఇరువైపుల నుంచి వరుసగా కాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్‌లోని అనారం, మర్రిమల్ అడవుల్లో ముగ్గురు నక్సల్స్ ను జవాన్లు హతమార్చారు. అన్నారం, మారిమల్ల అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు.
ఇటీవల గరియాబంద్‌లో రూ.కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పూర్ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో, గరియాబంద్ E30, STF, COBRA బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య అడపాదడపా ఎన్‌కౌంటర్‌లు కొనసాగుతున్నాయి.
కాగా, కీలక మహిళా నేత సునీతక్క మరికొందరు మావోయిస్టులతో కలిసి ఛత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన మావోయిస్టుల మీదున్న రివార్డులను పోలీసులు అందించారు. సునీతక్క 2022లో మావోయిస్టు పార్టీలో చేరి మాడ్ ప్రాంతంలో 6నెలల పాటు శిక్షణ పొందారు. అనంతరం పార్టీలో కీలక నేతగా ఎదిగి అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు.
The post Operation Chhatru: జమ్మూకశ్మీర్ లో ఆపరేషన్ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Operation Chhatru: జమ్మూకశ్మీర్ లో ఆపరేషన్ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !
Categories: