hyderabadupdates.com movies OTT కంపెనీల ప్లానింగ్… భవిష్యత్తు షాకింగ్?

OTT కంపెనీల ప్లానింగ్… భవిష్యత్తు షాకింగ్?

కరోనా వచ్చిన సమయంలో నిర్మాతలకు కామధేనువులా వ్యవహరించిన ఓటిటి కంపెనీలు ఇప్పుడు తమ స్ట్రాటజీలు మార్చుకుని నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటిదాకా కాంబినేషన్లు, హైప్ ని ఆధారంగా చేసుకుని భారీ రేట్లతో హక్కులు సొంతం చేసుకున్న ఓటిటిలు ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టక ముందే సినాప్సిస్ డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రిలీజయ్యాక రివ్యూలు, కలెక్షన్లను బట్టి ధరను డిసైడ్ చేస్తుండగా, మరికొన్ని పే పర్ వ్యూ మోడల్ లో ఎంత మంది చూస్తే అంత అనే షేరింగ్ పద్ధతిలో రెవిన్యూ పంచుకుంటున్నాయి. ఇవన్నీ ప్రొడ్యూసర్లకు శరాఘాతల్లా మారాయి.

తాజాగా నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసింది. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉందని సమాచారం. ఇప్పటిదాకా బ్యానర్లు, హీరోలు, స్టార్ డైరెక్టర్ల కాంబోలు చూసి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి కోట్లు ఖర్చు పెడుతున్న పద్దతికి స్వస్తి చెబుతారట. దాని స్థానంలో ఒరిజినల్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లు తీయాలనే దిశగా ఆల్రెడీ ప్రణాళికలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈటీవీ విన్ ఇదే తరహాలో థియేటర్ బిజినెస్ విత్ లోకల్ కంటెంట్ ఫార్ములా వాడి లిటిల్ హార్ట్స్ రూపంలో పెద్ద విజయం అందుకుంది. అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ ఇదే బాటలో కొన్ని సినిమాలు నిర్మించింది కానీ ఇంకా భారీ విజయం దక్కలేదు.

ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే దారిలో వెళ్తే మాత్రం మరింత క్వాలిటీ వెబ్ సిరీస్, మూవీస్ చూసే అవకాశం దక్కుతుంది. ఇప్పటికే పలు నిర్మాణంలో ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇదీ మంచిదే. ఓటిటిలోనే హై స్టాండర్డ్ కంటెంట్ దొరుకుతున్నప్పుడు అంతకన్నా మెరుగైనది థియేటర్ నుంచి ఆశిస్తారు. అప్పుడు దర్శక నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉంటారు. పోటీ వాతావణం ఉన్నప్పుడే నాణ్యత మెరుగు పడుతుంది. ఎంత ఫ్లాప్ అయినా ఓటిటిలో చూసే జనాలు ఉంటారు కానీ టికెట్లు కొనే ప్రేక్షకులు ఉండరు. ఓటిటి ఆఫర్లు తగ్గితే దాని ప్రభావం స్టార్ల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్ మీద ప్రభావం పడుతుంది. ఇది కూడా మంచిదే.

Related Post

35 Best South Korean Crime Movies of the 21st Century (So Far)35 Best South Korean Crime Movies of the 21st Century (So Far)

Since Parasite‘s incredible popularity, moviegoers have sought more South Korean film production. Unbeknownst to many, South Korea is known for crafting gritty, honest films that accurately represent the harsh realities

వారు న‌యా ‘న‌ర‌కాసురులు’: ప‌వ‌న్ అన్నది వారినేనా?వారు న‌యా ‘న‌ర‌కాసురులు’: ప‌వ‌న్ అన్నది వారినేనా?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు. `వారంతా న‌యా న‌ర‌కాసురులు` అని పేర్కొన్నారు. దీపావ‌ళి పండుగను పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన