hyderabadupdates.com Gallery Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా

Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా

Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా post thumbnail image

 
 
 
పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి ఉద్రిక్త వాఖ్యలు చేశారు. భారత్ తో యుద్ధం జరిగే అంశాన్ని కొట్టిపారేయలేమని ఒకవేళ పూర్తిస్థాయిలో యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలన్నారు.
ఇటీవలే భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆపరేషన్ సిందూర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం 88గంటల ట్రైలర్ మాత్రమేనన్నారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ఖయ్యానికి కాలు దువ్వారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ “నేను భారత్‌ను విస్మిరించడం లేదు అదే విధంగా నమ్మడం లేదు. నాఅంచనా ప్రకారం భారత్ నుంచి సరిహాద్దు చొరబాట్లైనా ఉండవచ్చు. లేదా పూర్తిస్థాయి యుద్ధమైనా జరగవచ్చు దేనికైనా మనం సిద్దంగా ఉండాలి” అని ఆసిఫ్ అన్నారు.
అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన ఖవాజా గతంలోనూ ఇలానే కూతలు కూశారు. భారత్, ఆప్గాన్ రెండు దేశాలతో ఏక కాలంలో యుద్ధం చేస్తామని ప్రకటించారు. పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఆదేశంలోని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఈ నెల 10 ఎర్రకోట కారు బాంబు దాడిలో సైతం పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ జైష్ మహమ్మద్‌కు సంబంధాలున్నాయని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.
 
The post Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీపైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పూర్తి పార‌దర్శ‌క‌తో పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామ‌న్నారు. భవిష్యత్

MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దుMLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

  బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్‌ దేబాంగ్సు

జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావుజ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు