hyderabadupdates.com Gallery Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌ post thumbnail image

 
 
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్‌ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్‌ సూచించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
 
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.ఎస్.పి. జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డి.ఎస్.పి. పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డి.ఎస్.పి. వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డి.ఎస్.పి. స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం డి.ఎస్.పి.పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
 
కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ఉపేక్షించం – హోం మంత్రి అనిత
 
దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలనుకునేవారు… దానిని ముందుకు తీసుకెళ్లలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులను శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు. కందుకూరులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడుపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన.. ఆర్ధిక లావాదేవీల్లో భాగంగా జరిగిందే అన్నారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్న పాటి గొడవ కక్షసాధింపుల వరకూ వెళ్లిందని తెలిపారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు.
 
లక్ష్మీనాయుడిని చాలా దారుణంగా హరిశ్చంద్రప్రసాద్ హత్య చేశారు. ఈ హత్య కేసు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. అలాగే హత్య నిందితుల ఆస్తుల జప్తునకు సిఫార్సు చేశాం. లక్ష్మీనాయుడి కుటుంబసభ్యులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం. లక్ష్మీనాయుడు సతీమణికి 2 ఎకరాలు, రూ.5 లక్షల పరిహారం, లక్ష్మీనాయుడు ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున ఇస్తాం, లక్ష్మీనాయుడి పిల్లల పేరిట రూ.5 లక్షల చొప్పున ఎఫ్‌డీ చేస్తాం. ఇదే ఘటనలో గాయపడిన పవన్, భార్గవ్‌కు పరిహారం ఇస్తాం. దాడిలో గాయపడిన పవన్‌కు 4 ఎకరాలు, రూ.5 లక్షల నగదు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు పరిహారం అందిస్తాం. ఇలాంటి ఘటనలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు అని హోంమంత్రి అనిత అన్నారు.
The post Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

    భారత్‌ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే… వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్‌ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు