hyderabadupdates.com Gallery PM Narendra Modi: జీ-20 శిఖరాగ్ర సమావేశంలో బిజీ బిజీగా మోదీ

PM Narendra Modi: జీ-20 శిఖరాగ్ర సమావేశంలో బిజీ బిజీగా మోదీ

PM Narendra Modi: జీ-20 శిఖరాగ్ర సమావేశంలో బిజీ బిజీగా మోదీ post thumbnail image

 
 
జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు. ప్రధాని మోదీ ఆదివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధానమంత్రి సనే తకైచితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
 
మెలోనితో జరిగిన సమావేశంలో భారతదేశం, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై ప్రధాని చర్చించారు. మెలోనీని ప్రధాని మోదీ కలవడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. శనివారం, జోహన్నెస్‌బర్గ్‌లోని జీ-20 శిఖరాగ్ర సమావేశ వేదికపై ఇద్దరూ కరచాలనం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదివారం సమావేశమై పలు అంశాల గురించి చర్చించుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని తకైచితో ప్రధాని సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు. తకైచి జపాన్ ప్రధాని అయిన తర్వాత ఆమెతో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి.
కాగా, అంతకుముందు, భారతదేశం, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీని కూడా మోదీ కలిశారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే కార్నీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ సమావేశంలో వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. ఇక, నెదర్లాండ్స్ ప్రధాని డిక్ స్కూఫ్‌తో కూడా మోదీ సమావేశపై పలు అంశాలు చర్చించారు.
 
The post PM Narendra Modi: జీ-20 శిఖరాగ్ర సమావేశంలో బిజీ బిజీగా మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాటఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. ఇవాళ స‌చివాల‌యంలో కీల‌క మంత్రివ‌ర్గం స‌మావేశం నిర్వ‌హించారు. త‌న అధ్యక్ష‌త‌న జ‌రిగిన ఈ కీల‌క భేటీలో ప‌లు ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లుటీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

హైద‌రాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ప్ర‌తి నిత్యం 70 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం

పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎంపోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు