hyderabadupdates.com Gallery PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ post thumbnail image

 
 
ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఇండియా- బ్రెజిల్- దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) నేతల సమావేశంలోనూ పాల్గొననున్నట్లు తెలిపింది.
 
‘‘20వ జీ-20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. వరుసగా నాలుగోసారి ఓ గ్లోబల్ సౌత్‌ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని ప్రసంగించనున్నారు. సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం; వాతావరణ మార్పులు, ఆహార వ్యవస్థలు; అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు అంశాలపై మాట్లాడనున్నారు. వివిధ దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు’’ అని విదేశాంగశాఖ వెల్లడించింది.
 
ఈ జీ-20 సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి రైతులను చూస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతకుముందు మయామిలో చేసిన ఓ ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్‌ నుంచి తొలగించాలని కూడా డిమాండ్‌ చేశారు.
The post PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచార‌ణఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచార‌ణ

హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ విచార‌ణ ముగిసింది. ఆదివారం మ‌ధ్యాహ్నం త‌ను నివాసం ఉంటున్న నందిన‌గ‌ర్ కు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. భారీ ఎత్తున

CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎంCM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం

CM Chandrababu : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని, నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సమయంలోగా భవనాల పనులు పూర్తి