hyderabadupdates.com Gallery PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ post thumbnail image

 
 
 
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్‌ సిందూర్‌, నక్సలిజం, జీఎస్టీ సంస్కరణలు తదితర అంశాలను ప్రస్తావించారు. భారత్‌ తన ధర్మానికి కట్టుబడి ఉండే, అన్యాయంపై ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. ధర్మాన్ని నిలబెట్టాలని శ్రీరాముడు బోధించాడు. అన్యాయంపై పోరాడేందుకు ధైర్యాన్ని ఇచ్చాడు. దీనికి సజీవ ఉదాహరణను మనం కొన్నాళ్ల కిందట చూశాం. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ధర్మాన్ని నిలబెట్టడమే గాక అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాం’ అని పేర్కొన్నారు. నక్సల్స్‌ హింసను వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చి భారత రాజ్యాంగాన్ని స్వీకరించడం అతి పెద్ద విజయమన్నారు.
 
స్థిరత్వం, ప్రగతికి ప్రతీక భారత్‌
‘‘చాలా జిల్లాల్లో నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం సమూలంగా తుడిచిపెట్టుపోతున్నాయి. మావోయిస్టులు హింసను వదిలేసి లొంగిపోతున్నారు. ప్రధాన అభివృద్ధి స్రవంతిలో కలిసిపోతున్నారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విధేయత చూపుతున్నారు. ఇది నిజంగా మన దేశం సాధించిన అతిపెద్ద ఘనతగా చెప్పాలి. తదుపరి తరం సంస్కరణలకు ఇటీవల శ్రీకారం చుట్టాం. నవరాత్రుల తొలిరోజు నుంచి జీఎస్టీ రేట్లు తగ్గించాం. జీఎస్టీ బచత్‌ ఉత్సవంతో దేశ ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్రపంచమంతటా సంక్షోభాలు, సమస్యలు నెలకొన్న తరుణంలోనూ భారత్‌లో అభివృద్ధి పరుగులు ఆగడం లేదు. స్థిరత్వం, ప్రగతికి ప్రతీకగా మారింది. మనం త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయం.
దివ్య దీపాలు వెలిగిద్దాం
దీపావళి పండుగ గొప్ప పాఠం నేరి్పస్తోంది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. దాంతో కాంతి మరింత పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. అదేతరహాలో ఈ దీపావళి సందర్భంగా చుట్టూ ఉన్న సమాజంలో సామరస్యత, సౌభ్రాతృత్వం, సహకారం, సానకూలత అనే దివ్య దీపాలు వెలిగిద్దాం. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రాణప్రతిష్ట తర్వాత మనకు ఇది రెండో దీపావళి. మనలో శక్తిని, ఉత్సాహాన్ని నింపే గొప్ప పండుగ ఇది. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
స్వదేశీని ఆదరించండి
‘దేశ పౌరులుగా మన ప్రాథమిక బాధ్యతలు, విధులు తప్పనిసరిగా నెరవేర్చాలి. దేశ అభివృద్ధే ధ్యేయంగా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, వినియోగించుకోవాలి. ‘ఇది స్వదేశీ’ అని గర్వంగా చెప్పుకోవాలి. ఏక్‌ భారత్, శ్రేష్ట భారత్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్దాం. అన్ని భాషలనూ గౌరవిద్దాం. రోజువారీ జీవితంలో స్వచ్ఛతకు పెద్దపీట వేద్దాం. పరిశుభ్రతే మన నినాదం కావాలి. ప్రజలంతా ఆరోగ్య సంరక్షణకు అత్య ధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో మంచినూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకుందాం. అదేసమయంలో యోగా చేయాలని ప్రజలను కోరుతున్నానని మోదీ సూచించారు’
 
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై దీపావళి సంబరాలు
 
ఈ ఏడాది దీపావళి వేడుకలను ప్రధాని మోదీ గోవా తీరంలో విమానవాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సిబ్బందితో కలిసి చేసుకున్నారు. నౌకాదళ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు తినిపించారు. యుద్ధ నౌకపై నుంచి మిగ్‌-29 యుద్ధ విమానాలు ఎగరడం, ల్యాండింగ్‌ కావడాన్ని వీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ …ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని మోదీ ప్రశంసించారు.
The post PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.

Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవితEx MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత

Ex MLC Kavitha : జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు