hyderabadupdates.com Gallery PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ post thumbnail image

 
 
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు. హెవీ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ 3.25 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండనుంది. ముంబై మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని బహుళ విమానాశ్రయ వ్యవస్థ ద్వారా గ్లోబల్ సిటీస్‌లో ముంబై ప్రతిష్టను మరింత పెంచే లక్ష్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు.
 
ముంబై మెట్రోలైన్-3
 
కాగా, ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుంచి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ముంబై వన్ యాప్‌ను కూడా ప్రారంభించారు. తద్వారా ప్రయాణికుల పలు ప్రయోజనాలు పొందవచ్చు. నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో షార్ట్-టర్మ్-ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంను కూడా ప్రధాని ప్రారంభించారు.
నవీ ముంబయి ఎయిర్‌ పోర్టు ప్రత్యేకత ఇదే
 
దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబయి ఎయిర్‌పోర్టు (CSMIA)పై భారాన్ని తగ్గించేందుకు గాను మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబయి ఎయిర్‌పోర్టును (NMIA) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సరికొత్త ఆకారంతోపాటు లగ్జరీ సదుపాయాలతో భవిష్యత్తు తరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ముంబయితోపాటు పుణె, కొంకణ్‌ ప్రాంతాలకు వాణిజ్య, పర్యాటకానికి మరింత ఊతం ఇస్తుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
ముంబయి దక్షిణానికి 37 కి.మీ దూరంలో ఉన్న ఉల్వేలో ఈ విమానాశ్రయం నిర్మించారు. పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రూ.19,650 కోట్లతో ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక టెర్మినల్‌ అందుబాటులోకి రాగా… ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి నాలుగు టెర్మినళ్లు ఉండనున్నాయి. 1160 హెక్టార్లలో ఈ విమానాశ్రయం విస్తరించి ఉంది. రన్‌వే పొడవు 3700 మీటర్లు. ఇలాంటివి రెండు రన్‌వేలు ఉన్నాయి. లోటస్‌ ఆకారంలో ఉన్న ఈ విమానాశ్రయం.. భవిష్యత్తు తరాల ఆలోచనలకు అనుగుణంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ డిజైన్‌కు బ్రిటిష్‌ అర్కిటెక్చరల్‌ సంస్థ జహా హదీద్‌ రూపకల్పన చేసింది.
 
ప్రారంభంలో ఏటా 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించనుండగా.. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉంటుందని అంచనా. ప్రస్తుత వార్షిక కార్గో సామర్థ్యం 0.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉండగా.. రానున్న రోజుల్లో 3.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కార్గో సేవలు అందించేలా నిర్మిస్తున్నారు. ప్రముఖుల కోసం లాంజ్‌లు, చిన్నారుల కోసం ప్రత్యేక జోన్లు, డిజిటల్‌ తెరలు, ప్రయాణికుల స్వల్పకాలిక విడిది కోసం ఎయిర్‌పోర్టులోపల ఓ హోటల్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి.
The post PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీPM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ

Narendra Modi : ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నిరంతర శాంతి ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. గాజా నుంచి 20 మంది ఇజ్రాయెల్ బందీలు తిరిగి విడుదల కావడాన్ని