hyderabadupdates.com Gallery Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు post thumbnail image

 
 
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై స్థానిక సబ్-డివిజినల్ అధికారి (SDO) ఈ ఫిర్యాదు నమోదు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు గట్టి పట్టున్న రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఎలాగైతే అమేథీలో ఓడిపోయారో అలాగే తేజస్విని సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని కిశోర్ తెలిపారు. ‘మీ ఎమ్మెల్యే రెండు సార్లు ఉపముఖ్యమంత్రి అయ్యారు. మీ సమస్యలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు’ అంటూ తన ఎన్నికల ప్రసంగంలో తేజస్విపై పీకే విమర్శలు గుప్పించారు.
దీనికి ముందు పాట్నా నుంచి రఘోపూర్‌కు ప్రశాంత్ కిశోర్ బయలుదేరుతూ, తేజస్వి ఈసారి రెండు సీట్లలో పోటీ చేస్తారని తెలుస్తోందని, ఆయనకు అంత భయమైతే రెండు చోట్లా పోటీ చేయవచ్చని, రాహుల్ గాంధీ 2019లో రెండు సీట్లలో పోటీ చేసిన అమేథీలో ఓడిపోయినట్టే రఘోపూర్‌లోనూ తేజస్వికి ఓటమి తప్పదన్నారు. తేజస్విపై పోటీ చేసే అవకాశంపై అడిగినప్పుడు సూటిగా సమాధానం ఇవ్వలేదు. జన్ సురాజ్ పార్టీ సెంట్రల్ కమిటీ ఆదివారంనాడు సమావేశమవుతుందని, రఘోపూర్ ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆదారంగా తగిన అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు.
The post Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు