hyderabadupdates.com Gallery Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు post thumbnail image

Rabri Devi : బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్‌ లాలూ భార్య రబ్రీదేవి (Rabri Devi) తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె మాట్లాడుతూ… ఆయనను పోటీ చేయనివ్వాలని… ఆయన తన ప్రాతినిధ్య స్థానం నుంచే పోటీ చేస్తున్నారని అన్నారు.
Rabri Devi Shocking Comments
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అమ్మేసిందని, డబ్బంతా ప్రధాని మోదీ ఇంటికి చేరిందని రబ్రీదేవి (Rabri Devi) వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 70 వేల కోట్ల మోసానికి పాల్పడ్డారని, కానీ దానిపై ఎక్కడా చర్చ జరగలేదన్నారు. లాలూ ఎలాంటి తప్పు చేయలేదని, తాము కోర్టులో కేసును ఎదుర్కొంటామన్నారు. తన మరో కుమారుడు, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ విజయంపై రబ్రీ దేవి నమ్మకం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.
రఘోపూర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిని చేస్తారని రబ్రీ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రఘోపూర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా మహాకూటమి తాజాగా ‘బీహార్ కా తేజస్వి ప్రాణ్’ అనే పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దానిలో ప్రజలకు పలు హామీలనిచ్చింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.
Also Read : Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !
The post Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడుMinister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు

    విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిల్లీలో ఉన్న కేంద్ర పౌర

Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసుKarur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు

Karur Stampede : కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.