పాకిస్థాన్‌లోని ‘సింధ్’ప్రాంతం విషయంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నేడు భారత్‌లో భాగం కాకపోయినా.. ఇక్కడి నాగరిక వారసత్వంతో ఇప్పటికీ ముడిపడి ఉందన్నారు. సరిహద్దులు మారొచ్చని, 1947లో దేశ విభజన అనంతరం పాక్‌లో భాగమైన సింధ్.. భవిష్యత్తులో తిరిగి భారత్‌లో కలవొచ్చని వ్యాఖ్యానించారు. దిల్లీలో సింధీ సమాజం కార్యక్రమంలో ఆయన ఈమేరకు ప్రసంగించారు.
‘‘సింధీ హిందువులు.. ముఖ్యంగా తన తరం వారు సింధ్‌ను భారత్ నుంచి వేరుచేయడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ తన ఓ పుస్తకంలో రాశారు. కేవలం సింధ్‌లోనే కాదు.. భారత్‌వ్యాప్తంగా హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారు. నేడు ఆ ప్రాంతం భారత్ భాగం కాకపోవచ్చు. కానీ.. నాగరికత ప్రకారం ఎల్లప్పుడూ మన దేశంలో భాగంగా ఉంటుంది. ఇక భూమి విషయానికొస్తే.. సరిహద్దులు మారొచ్చు. ఎవరికి తెలుసు.. భవిష్యత్తులో సింధ్ మళ్లీ మన దేశంలో కలవొచ్చు. సింధీ ప్రజలు ఎక్కడున్నా.. ఎల్లప్పుడూ మనవాళ్లే’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
గతంలో పీవోకే (POK) ప్రజలూ మనవాళ్లేనని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అక్కడున్న వారికి భారత్‌తో దృఢమైన సంబంధాలున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం దానంతట అదే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు. పీవోకేవాసులు భారత్‌లో కలిసేందుకు ముందుకు రావాలని కూడా ఓ సందర్భంలో పిలుపునిచ్చారు. పాకిస్థాన్ మాదిరి తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని తెలిపారు.
భారత్‌లో అనేక పేలుళ్లకు పాక్ ప్రణాళిక – దేవేంద్ర ఫడణవీస్
దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై పలు ఆరోపణలు చేశారు. పొరుగునున్న పాక్ ఎర్రకట వద్ద పేలుడుకు కుట్ర పన్నిందన్నారు.
శనివారం 26/11 ముంబయి పేలుళ్ల స్మారక కార్యక్రమంలో మాట్లాడుతూ ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్‌ను భద్రతాధికారులు ఛేదించడాన్ని ప్రశంసించారు. మాడ్యూల్ నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీని కారణంగా ముంబయితో సహా అనేక నగరాల్లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగామన్నారు. యుద్ధంలో నేరుగా భారత్‌ను ఓడించలేని పాక్.. ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడుతోందన్నారు. ఎర్రకోట వద్ద బాంబు పేలుడుకు ఆ దేశమే కుట్ర పన్నిందన్నారు. భారత్‌లోని అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్రణాళికలు చేసిందన్నారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో పాటు ఎర్రకోట పేలుడు గురించి ఫడణవీస్ మాట్లాడారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద ముప్పు ఇంకా కొనసాగుతోందని.. దేశం అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
The post Rajnath Singh: సింధ్ మళ్లీ భారత్‌లో కలవొచ్చు – రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Rajnath Singh: సింధ్ మళ్లీ భారత్‌లో కలవొచ్చు – రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్
Categories: