hyderabadupdates.com Gallery Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో

Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో

Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో post thumbnail image

 
 
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మురం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ వీడియో బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు దాడికి పాల్పడడానికి ముందు ఉమర్ ఆ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ ఆ వీడియోలో మాట్లాడినట్లు సమాచారం. ‘ఆత్మాహుతి దాడిని అపార్థం చేసుకున్నారు. ఇదొక బలిదానం’ అని చెప్పినట్లు తెలుస్తోంది. చనిపోయే స్థలం, సమయం, పరిస్థితుల గురించి కూడా ఉమర్ నబీ మాట్లాడినట్లు సమాచారం. నవంబర్ 9వ తేదీన అల్ఫల యూనివర్సిటీలో ఉమర్ వీడియో రికార్డు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరుసటి రోజు నవంబర్ 10వ తేదీన అతడు ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇందుకోసం ఐ20 కారును ఉపయోగించాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఉమర్‌కు సహకరించిన అతడి బంధువుతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నాయి.
 
డిసెంబర్‌ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు) భారీ పేలుళ్లకు ఉమర్‌ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతలోనే ఫరీదాబాద్‌ ఉగ్ర నెట్‌వర్క్‌ కుట్ర బయటపడింది. ఇదికాస్త ఉమర్‌లో భయాందోళనకు దారితీయడం… చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈనెల 10న చోటుచేసుకున్న ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించారు. ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ గత ఏడాది నుంచి ఓ సూసైడ్‌ బాంబర్‌ కోసం అన్వేషిస్తోందట. దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన డా.ఉమర్‌ నబీ దీనికోసం ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల విచారణలో… ఉమర్ ఓ కరడుగట్టిన ఉగ్రవాది అని, తమ కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని అతడు పట్టుబట్టినట్లు తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేయడం గురించి ప్రతిసారీ అతడు ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని వార్తలు వచ్చాయి.
 
The post Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !

    అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. మరోవైపు వైసీపీ

Pawan Kalyan Visits Kakinada, Promises Aid to FisherfolkPawan Kalyan Visits Kakinada, Promises Aid to Fisherfolk

Kakinada: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited the Kakinada Collectorate to engage with fishing community representatives from Uppada and state officials. During the meeting, fishermen highlighted the adverse

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

    బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు… తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను