hyderabadupdates.com Gallery Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి ! post thumbnail image

 
 
 
మహారాష్ట్రలో పుణే – బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్.. ఎదురుగా వస్తున్న వాహనాలను వేగంగా ఢీ కొట్టంది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యధిక వేగంతో వస్తున్న కంటైనర్ ట్రక్.. నియంత్రణ కోల్పోయిందని పోలీసులు తెలిపారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు.. రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
The post Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.

CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

  చాదర్‌ఘాట్ (Chaderghat) విక్టోరియా గ్రౌండ్‌లో  మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఇందుకు గల కారణాలను పోలీసు

Bomb Threat: తమిళనాడులో సీఎం సహా ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపుBomb Threat: తమిళనాడులో సీఎం సహా ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు

    తమిళనాడులో సీఎం స్టాలిన్‌ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం, అది ఫేక్‌ బెదిరింపు మొయిల్‌ అని పోలీసులు