hyderabadupdates.com Gallery Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’ post thumbnail image

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex) కనిపించినప్పటికీ… దర్శకుడు లోకేష్ కనగరాజ్… సూర్య పాత్రను ప్రజెంట్ చేసిన తీరు సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేసింది. దీనికి అనిరుధ్ కొట్టిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్… ఆ పాత్రను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. దీనితో ఈ రోలెక్స్ పేరుకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ సినిమాలో రోలెక్స్ లాగే కోయంబత్తూరు ప్రాంతంలోనూ ఒక ‘రోలెక్స్‌’ ఉన్నాడు. అదేనండి కోయంబత్తూరు అటవీ ప్రాంతంలో ఉన్న ఎనుగుల్లో… ఒకదానికి రోలెక్స్ అని అటవీశాఖ అధికారులు నామకరణం చేసారు. అయితే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంతమంది ప్రాణాలు తీసాడో ఇంకా తెలియదు గాని… ఈ రోలెక్స్ వల్ల పంటలే కాదు… ప్రజల ప్రాణాలూ పోతున్నాయి.
Operation Rolex
దీంతో ఎలాగైనా రోలెక్స్‌ ను నియంత్రించాలని నిర్ణయించిన అధికారులు… కపిల్‌దేవ్‌, వసీం, బొమ్మన్‌ అనే కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. ఇదిగో పైన ఫొటోలో తాళ్లతో బంధించినట్లు కనిపిస్తున్న ఈ గజరాజే ఆ రోలెక్స్‌. తొండముత్తూర్‌ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఏనుగుని సుదీర్ఘ ఆపరేషన్‌ చేపట్టిన తర్వాత ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. అక్టోబర్‌ 17న తెల్లవారుజామున 2గంటలకు ఆపరేషన్‌ మొదలుపెట్టిన అటవీశాఖ అధికారులు… రోలెక్స్‌ని పట్టుకొనేందుకు కుంకీ ఏనుగులు, పశువైద్య నిపుణుల సాయం తీసుకొన్నారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చి దాని దూకుడును తగ్గించారు. అనంతరం దీన్ని లారీలోకి ఎక్కించేందుకు కపిల్‌దేవ్‌, వసీం, బొమ్మన్‌ అనే కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు. రోలెక్స్‌ కాళ్లు, మెడకు తాళ్లు కట్టి… కుంకీ ఏనుగలతో లాగించి లారీలోకి ఎక్కించారు. ఆ తర్వాత రోలెక్స్‌ను వరకలియార్ ఎలిఫెంట్‌ క్యాంప్‌నకు తరలించారు.
Also Read : Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు
The post Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌ – సీఎం రేవంత్CM Revanth Reddy: ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌ – సీఎం రేవంత్

    అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్యస్థాన‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌,