hyderabadupdates.com Gallery Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం

Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం

Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం post thumbnail image

 
 
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు. మలికప్పురం ఆలయం వెనుక ఉన్న ఈ సత్రంలో రోజు 10 వేలమందికిపైగా భక్తులకు మూడు పూటలా ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. ఇటీవల మండల- మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర ప్రారంభం కాగా.. ఇక్కడ భోజనం చేసినవారి సంఖ్య శనివారం నాటికి లక్ష దాటింది.
శబరిమలలోని అన్నదాన సత్రం ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన మండపాల్లో ఒకటి. ఒకేసారి వెయ్యిమందికిపైగా భక్తులకు వడ్డించే ఏర్పాట్లు ఉన్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 వరకు, సాయంత్రం 6.45 నుంచి ఆ రోజు ఆలయం మూసివేసే వరకు మూడు పూటలా ఆహారం అందజేస్తారు. వంటలు చేయడం, వడ్డించడం, క్లీనింగ్‌ కోసం 235 మంది సిబ్బందిని నియమించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు.
The post Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌

Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్

    ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులుAP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

    కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై