hyderabadupdates.com Gallery Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్

Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్

Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ post thumbnail image

Sanjay Raut : శివసేన (UBT) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన తన మద్దతుదారులకు సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేసారు. అకస్మాత్తుగా తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాయని అందులో తెలిపారు. త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకం తనకుందని చెప్పారు. తన పట్ల చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరినీ తప్పక కలుసుకుంటానని అన్నారు.
Sanjay Raut Hospitilized
కాగా, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్‌కు సూచించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రౌత్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన అస్వస్థతకు కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ప్రత్యర్థి పార్టీల నేతల వ్యాఖ్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారనే పేరు సంజయ్ రౌత్‌కు ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘటుగా స్పందించారు. మహారాష్ట్రలో బీజేపీ ఎవరి ఆసరా లేకుండా సొంత బలం కలిగి ఉందని అమిత్‌షా వ్యాఖ్యానించగా, బీజేపీ ప్రస్తుత భాగస్వాములైన ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గాన్ని అవమానించేలా అమిత్‌షా వ్యాఖ్యలు ఉన్నాయని సంజయ్ రౌత్ తప్పుపట్టారు.
Also Read : Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు
The post Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దుMLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

  బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్‌ దేబాంగ్సు