hyderabadupdates.com Gallery Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు post thumbnail image

 
 
సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటకలోగల సత్యసాయి గ్రామంలో మానవత్వం, ఐక్యత చాటేలా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్‌ కార్యక్రమం జరుగుతోంది. ఆగస్టు 16న మొదలైన ఈ కార్యక్రమం 100 రోజుల పాటు జరగనుంది.
ఈ క్రమంలో నవంబర్ 17న జరిగిన వేడుకకు ఫిజీ అధ్యక్షుడు రటు నైకామా, ఆయన సతీమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు ఫిజీ సంప్రదాయక ఇటవుకే పద్ధతిలో స్వాగతం పలికారు. ఫిజీతో పాటు ఇతర దక్షిణ పసిఫిక్ ద్వీప దేశాలు, భారత్ మధ్య స్నేహబంధాన్ని గుర్తుకుతేచ్చేలా ఈ ఈవెంట్ సాగింది. ప్రజల మధ్య ఐక్యత చాటేలా 100 దేశాల వారు పాల్గొన్న ఈ ఈవెంట్‌పై ఫిజీ అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ప్రేమ, సేవ, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సాయి ప్రేమ ఫౌండేషన్, శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ ఆసుపత్రి‌ని కూడా అభినందించారు. హెల్త్ కేర్ రంగంలో వాణిజ్య పోకడలను తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
 
సత్యసాయి గ్రామంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్న తీరు అత్యుత్తమ మానవసేవ అని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాలకు ఈ విధానం స్ఫూర్తిని ఇస్తుందని వ్యాఖ్యానించారు. లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ దిశగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయికి అన్ని సహాయసహకారాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇక సద్గురు మధుసూదన్ సాయి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఫిజీ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో సత్కరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఈ పురస్కారం అందుకున్న వ్యక్తి సద్గురు మధుసూదన్ సాయి. ఇక నవంబర్ 23న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో కూడా ఫిజీ అధ్యక్షులు పాల్గొంటారు.
The post Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన 

రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మంగళవారం పర్యటించారు. కృష్ణా జిల్లా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా

KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్

    హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటనMinister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

    దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి