hyderabadupdates.com Gallery Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్

Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్

Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ post thumbnail image

 
యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 42 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ స్పందించారు. మదీనాలో భారత పౌరులకు జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్‌ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు సహా 42 మంది సజీవ దహనమయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్‌వాసులని సమాచారం.
The post Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాంనదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పారే న‌దుల‌ను అనుసంధానం చేస్తామ‌ని, ప్ర‌తి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు.

ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!

కన్నడ హీరో,  డైరెక్టర్ రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన నటనకు మరియు దర్శకుడిగా చూపిన ప్రతిష్టకు ప్రేక్షకులు చాలా మెచ్చుతున్నారు. ఈ సినిమా సంబంధిత పనులు పూర్తయిన తర్వాత రిషబ్ ప్రస్తుతం పూర్తి

పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలిపిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలని కోరారు. ఈ మేర‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన