hyderabadupdates.com Gallery Secreat Camera: ప్రియుడి కోసం ఉమెన్స్ హాస్టల్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యువతి

Secreat Camera: ప్రియుడి కోసం ఉమెన్స్ హాస్టల్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యువతి

Secreat Camera: ప్రియుడి కోసం ఉమెన్స్ హాస్టల్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యువతి post thumbnail image

 
 
కర్ణాటకలోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్‌ కంపెనీ మహిళా సిబ్బంది ఉండే హాస్టల్‌లోని బాత్‌రూంలో రహస్య కెమెరా ఎపిసోడ్‌లో సంచలన విషయం బయటకు వచ్చింది. తన ప్రియుడు చెబితేనే బాత్‌రూంలో తాను సీక్రెట్‌ కెమెరా అమర్చినట్టు నిందితురాలు చెబుతోంది. ఇక, ఈ ఘటనలో కెమెరా అమర్చిన ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలో 20 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా కార్మికుల కోసం హాస్టల్‌ వసతి కల్పించింది. ఉద్దనపల్లి సమీపంలో ఒడిశా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 6 వేల మందికి పైగా మహిళా కార్మికులు హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హాస్టల్లోని బాత్‌ రూంలో ఒడిశాకు చెందిన నీలాకుమారి గుప్తా (23) అనే కార్మికురాలు రహస్య కెమెరా ఏర్పాటు చేసి ఇతర మహిళల వీడియోలను రికార్డు చేసి తన ప్రియుడు సంతోష్‌కి పంపిస్తోంది.
బెంగళూరులో అరెస్టు చేసి
అతడు వాటిని ఇంటర్నెట్‌లో పోస్టు చేయసాగాడు. తమ స్నానాల వీడియోలు వైరల్‌ అయినట్లు తెలిసి వేలాది మంది మహిళలు పరిశ్రమ యంత్రాంగం దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదు. దీనితో మంగళవారం రాత్రి నుంచి హాస్టల్‌ ముందు ధర్నా చేసారు. పలువురు నేతలు మహిళలకు మద్దతు తెలిపారు. ఉద్దనపల్లి పోలీసులు దర్యాప్తు జరిపి నిందితురాలు నీలాకుమారి గుప్తాని అరెస్ట్‌ చేశారు. ప్రియుడు సంతోష్‌కుమార్‌ సూచనల మేరకు రహస్య కెమెరా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది. బెంగళూరులో దాగి ఉన్న నిందితున్ని గురువారం అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారు. ఇతడు కూడా ఒడిశా వాసి కాగా బెంగళూరులో పనిచేసుకునేవాడు. వారిద్దరినీ తీవ్ర విచారణ జరుపుతున్నారు. తమ వీడియోలను ఇంటర్నెట్‌ నుంచి తొలగించాలని, హాస్టళ్లలో భద్రత కల్పించాలని మహిళా సిబ్బంది డిమాండ్‌ చేశారు.
 
ప్రియుడిపై పగతో పోలీసులతో ఐటీ ఉద్యోగిని ఆటలు
 
ప్రేమ విఫలం కావడంతో ప్రియుడి పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రేమ విఫలమైన బాధ ఆమెను వెంటాడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి పేరుతో బాంబు బెదిరింపులకు పాల్పడింది. విమానాశ్రయాలు, బడులు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలను తరుచూ బెదిరిస్తున్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌సింగ్‌ మీడియాకు వెల్లడించారు. రెని జోషిల్డా బెంగళూరులో రోబోటిక్స్‌ ఇంజినీర్‌గా పనిచేసేది. సహోద్యోగితో ప్రేమ విఫలం కావడం… అతను మరో యువతిని పెళ్లాడాడు. దీంతో అతనిపై పగ పెంచుకుంది. ప్రియుడి పేరుతో నకిలీ ఈ–మెయిల్స్, వాట్సాప్‌ అకౌంట్లు సృష్టించి… వాటి ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు పంపించేది.
అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ క్రికెట్‌ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు గతంలో హెచ్చరించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తన ప్రియుడు కారణమంటూ ఈ–మెయిల్‌ పంపింది. ప్రియుడి పేరిట బెదిరిస్తే… అతడిని అరెస్టు చేస్తారనేది ఆమె ప్లాన్‌. ఇలా జూన్‌ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. ఆ కేసు విచారణ ఉత్తర విభాగం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేపట్టారు. ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె ప్రాథమిక విచారణలో అంగీకరించిందని కమిషనర్‌ వివరించారు. దీంతో, దర్యాప్తు మొదలుపెట్టిన గుజరాత్‌ పోలీసులు.. విచారణ జరిపి రెని జోషిల్డాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అహ్మదాబాద్‌ జైలు నుంచి వారెంట్‌పై బెంగళూరుకు తెస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆమెను విచారిస్తున్నామని వెల్లడించారు.
 
The post Secreat Camera: ప్రియుడి కోసం ఉమెన్స్ హాస్టల్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యువతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడుCM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

    బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్‌. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్