hyderabadupdates.com Gallery SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల post thumbnail image

 
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్2), ఏప్రిల్ 1న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్టు అధికారులు ఇవాళ(శుక్రవారం) ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు అధికారులు.
 
క్రేన్‌ కూలి టీచర్‌ మృతి హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
శ్లాబ్‌ సామగ్రి మోసుకెళ్లే క్రేన్‌ కూలి… అనకాపల్లి జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ మృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజానగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఉపాధ్యాయురాలు దుర్మరణం చెందారు. పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది. దీనికి శ్లాబ్‌ వేసేందుకు క్రేన్ సాయంతో సామగ్రి పైభాగానికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో క్రేన్‌ కూలి.. పాఠశాల లోపలికి వెళ్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్‌(45)పై సామగ్రి పడింది. గాయపడిన ఆమెను హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు.
The post SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీసంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ గెలుపొందింది. ప్ర‌స్తుతం ఇండియా

Faridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్రFaridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

    దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్‌ ఉగ్రవాద ముఠా ప్రణాళిక సిద్ధం చే సినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గుర్తించారు. ఏకంగా 32 కార్లలో బాంబులు అమర్చి, 8 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో

Akshay Kumar Shares Daughter’s Cybercrime Experience, Urges Cyber Education in SchoolsAkshay Kumar Shares Daughter’s Cybercrime Experience, Urges Cyber Education in Schools

Cybercrime has emerged as a major challenge not only for ordinary citizens but also for celebrities, with online fraudsters resorting to tactics such as stealing money from bank accounts, morphing