ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్2), ఏప్రిల్ 1న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్టు అధికారులు ఇవాళ(శుక్రవారం) ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు అధికారులు.
క్రేన్ కూలి టీచర్ మృతి హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
శ్లాబ్ సామగ్రి మోసుకెళ్లే క్రేన్ కూలి… అనకాపల్లి జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ మృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజానగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఉపాధ్యాయురాలు దుర్మరణం చెందారు. పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది. దీనికి శ్లాబ్ వేసేందుకు క్రేన్ సాయంతో సామగ్రి పైభాగానికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో క్రేన్ కూలి.. పాఠశాల లోపలికి వెళ్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్(45)పై సామగ్రి పడింది. గాయపడిన ఆమెను హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు.
The post SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Categories: