hyderabadupdates.com Gallery Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు

Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు

Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు post thumbnail image

 
 
కార్తీక పౌర్ణమి వేళ… ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్ ఏర్పడింది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు చేశాడు. అయితే మాములుగా కంటే.. చంద్రుడు 13 శాతం అధికంగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీనినే బీవర్ సూపర్ మూన్‌ అని పిలుస్తారు. ఈ సూపర్‌ మూన్ ఈ ఏడాదిలో ఏర్పడిన రెండోది.
చంద్రుడు… భూమి చుట్టూ తిరిగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా.. దూరంగా వెళ్తుంటాడు. ఈ పౌర్ణమి వేళ.. చంద్రుడు తన కక్ష్యలో భూమికి సమీపానికి వచ్చినప్పుడు సూపర్ మూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో భూమికి చంద్రుడు దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణ పౌర్ణమి కంటే చంద్రుడు పెద్దగా కనిపించాడు. చంద్రుడు చేరుకునే సమయంలో భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యకు సమీపంలో ఉన్న పెరజీ వద్ద సూపర్ మూన్ సంభవిస్తోంది.
 
దేవ్‌ దీపావళి వేళ దేదీప్యమానంగా కాశీ
కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర కాశీ నగరంలో దేవ్‌ దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన కాశీ దీపాల వెలుగులతో దేదీప్యమానమైంది. గంగానదీ ఘాట్‌లలో భక్తులు లక్షలాది దీపాలను వెలిగించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘కాశీలో అద్భుతమైన దేవ్‌ దీపావళి’ అని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా లేజర్‌, ఫైర్‌వర్క్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గంగా ఘాట్‌ల వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో ఆధ్మాత్మికత వెల్లివిరిసింది.
The post Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Special Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణSpecial Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ

    దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది. 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో

Vijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్‌ మాల్యVijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య

    తనకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా… ఎక్కువ మొత్తంలో వసూలు చేశాయని విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్య అభ్యంతరం తెలిపారు. తన నుంచి వసూలు చేసిన అసలు, వడ్డీలకు మరోసారి కొత్తగా వడ్డీ విధిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక

VVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులుVVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులు

    బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్‌ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం… ఓ సహాయ రిటర్నింగ్‌ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్‌ చేయడంతో పాటు