hyderabadupdates.com Gallery Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి post thumbnail image

Supreme Court : దిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court) ఏప్రిల్‌ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. పర్యావరణహితమైన బాణసంచాతో వారిని పండగ చేసుకోవడానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరాయి. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలపాటు పర్యావరణహితమైన బాణసంచా కాల్చడానికి అనుమతివ్వాలని ఎన్సీఆర్‌ (NCR) రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్‌ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.
Several States Request to Supreme Court for Diwali
కొన్ని షరతుల కింద రాష్ట్రాల్లో బాణసంచా వాడకాన్ని అనుమతించవచ్చని, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (NEERI) ఆమోదించిన పర్యావరణహిత బాణసంచా మాత్రమే తయారు చేసి, విక్రయించేలా సూచించాలని తుషార్ మెహతా పేర్కొన్నారు. అత్యధిక పేలుడు స్వభావమున్న టపాసులు తయారు చేయకుండా రాష్ట్రాలు, దిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని ధర్మాసనానికి తెలియజేశారు. అదే విధంగా వ్యాపారులు అనుమతి పొందిన క్రాకర్లను మాత్రమే విక్రయించాలని.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మొదలైన ఏ ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్లు కూడా బాణసంచాను ఆన్‌లైన్‌లో విక్రయించవద్దని సూచించారు. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
Also Read : Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం
The post Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !

    ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 6 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తోంది. పోర్ట్ బ్లేయర్ పశ్చిమ దిశకు 620 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశలో 780 కిలోమీటర్ల దూరంలో ఉంది.